Ampere Magnus Neo Launched: ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఆంపియర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'అమెపెరె మాగ్నస్ నియో'ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ రూ.79,999 (ఎక్స్-షోరూమ్) ధరతో తీసుకొచ్చింది. ఆంపియర్ లైనప్‌లోని EX వేరియంట్ స్థానంలో ఈ కొత్త మాగ్నస్ నియోను ఉంచనున్నట్లు తెలుస్తోంది.
అమెపెరె మాగ్నస్ నియో డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్: దీని డిజైన్ విషయానికి వస్తే, ఈ కొత్త మాగ్నస్ నియో చూసేందుకు చాలా వరకు దాని ఇతర వేరియంట్ల మాదిరిగానే ఉంటుంది. అయితే వీటిలో కేవలం కలర్ స్కీమ్ మాత్రమే డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌తో లభిస్తుంది. ఈ స్కూటర్ 2.3kWh LFP బ్యాటరీని కలిగి ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70-80 కి.మీ వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.
ఈ కొత్త మాగ్నస్ నియో LFP బ్యాటరీలను (ఇవి ఒకే కెపాసిటీ గల NMC బ్యాటరీల మాదిరిగా ఎనర్జీ-డెన్సిటీ కలిగి ఉండవు) ఉపయోగిస్తుంది. దీంతో దీని రేంజ్ మాగ్నస్ EX కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక మాగ్నస్ EX రేంజ్ 80-100 కిలోమీటర్లు అని కంపెనీ ఇదివరకు వెల్లడించిన విషయం తెలిసిందే.
65 కి.మీ టాప్ స్పీడ్: ఆంపియర్ మాగ్నస్ నియో టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. మాగ్నస్ ఏ వేరియంట్ కూడా ఇంత అత్యధికమైన స్పీడ్‌ను అందించదు. దీనిలో మరో స్పెషాలిటీ ఏంటంటే మాగ్నస్ నియో రెండు వైపులా 12-అంగుళాల చక్రాలను కలిగి ఉంది. ఇతర వేరియంట్లు కేవలం 10-అంగుళాల చక్రాలతో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్: ఈ స్కూటర్ మార్కెట్లో ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
- బ్లాక్
- బ్లూ
- రెడ్
- వైట్
- గ్రే
ఇతర ఫీచర్లు: ఆంపియర్ మాగ్నస్ నియో ఇతర వేరియంట్ల మాదిరిగానే చాలా ఫీచర్లను కలిగి ఉంది. ఇది చిన్న డిజిటల్ డాష్‌తో కూడిన సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ కొత్త మాగ్నస్ నియో 5 సంవత్సరాల/75,000 కి.మీ బ్యాటరీ వారంటీతో వస్తుంది. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 5-6 గంటలు పడుతుంది.
ధర: కంపెనీ దీని ధరను రూ. 79,999గా నిర్ణయించింది. ఈ ధరతో మాగ్నస్ నియో ప్రస్తుతం అమ్మకానికి ఉన్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి.
టాటా పంచ్ ధరల పెంపు- ఇప్పుడు అదనంగా రూ.17,090 ఖర్చు చేయాల్సిందే!
పండగ వేళ చౌకైన రీఛార్జ్ ప్లాన్ లాంఛ్- రోజుకు రూ.8 కంటే తక్కువ ఖర్చుతో అన్లిమిటెడ్ బెనిఫిట్స్!
'మహా కుంభ్'పై గూగుల్ గులాబీ రేకుల వర్షం!- మీరు కూడా ట్రై చేయొచ్చు- అదెలాగంటే?