ETV Bharat / state

ఎక్స్‌పీరియం పార్కు - నగరవాసులకు ఇది ఎంతో ప్రత్యేకం - CM REVANTH OPENED EXPERIUM PARK

రంగారెడ్డి జిల్లాలో ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్కు ప్రారంభించిన సీఎం రేవంత్ - కార్యక్రమంలో పాల్గొన్న జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి - ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఏర్పాటు

CM Revanth Reddy Inaugurated Eco Friendly Experium Park
CM Revanth Reddy Inaugurated Eco Friendly Experium Park (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2025, 3:12 PM IST

Updated : Jan 28, 2025, 4:33 PM IST

CM Revanth Reddy Inaugurated Eco Friendly Experium Park : రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం పొద్దుటూరులో ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్కు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ మహేందర్‌రెడ్డి, ప్రముఖ నటుడు చిరంజీవి, ఎంపీ అనిల్‌ కుమార్ యాదవ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రాష్ట్రంలో పర్యాటక పాలసీని తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామన్నారు. మందిరాల దర్శనాల కోసం తమిళనాడు, ఇతర ప్రాంతాలకు వెళ్తాన్నామని, అటవీ ప్రాంతాల సందర్శనకు మధ్యప్రదేశ్​ ప్రాంతాలను వెళ్తున్నామన్నారు. అన్ని సహజ వనరులున్న తెలంగాణపై గత ప్రభుత్వాలు దృష్టి సారించలేదని విమర్శించారు. వెయ్యి స్తంభాల గుడి, రామప్ప, వేములవాడ వంటి ప్రముఖ ఆలయాలు, కవ్వాల్, నల్లమల రిజర్వ్ పారెస్ట్​, మల్లెల తీర్థం వంటి ప్రాంతాలున్నాయని వివరించారు. టూరిజం అభివృద్ధి కోసం కొత్త పాలసీ తీసుకొస్తామని అన్నారు.

డైనోసార్లు, ఆదిమానవులు, ఇంకా మరెన్నో - ఈ పార్కుకు వెళితే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు!

"రాష్ట్రంలో టెంపుల్‌, ఎకో, హెల్త్‌ టూరిజం వెనకబడుతోంది. ఎకో టూరిజంపై ఇటీవలే అసెంబ్లీలో చర్చించాం. పర్యాటక పాలసీ తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం. ఎకో టూరిజం కింద త్వరలో వికారాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో మరిన్ని పర్యాటక క్షేత్రాలు రావాల్సి ఉంది. వరితో పాటు వాణిజ్య పంటల ప్రోత్సాహానికి ప్రభుత్వ ప్రణాళికలు. తెలంగాణను ప్రకృతివనంగా మార్చాల్సి ఉంది. తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తెస్తాం. త్వరలో విధివిధానాలతో ముందుకు వస్తాం." - రేవంత్ రెడ్డి, సీఎం

ఇందులో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఎక్స్​ పీరియం పార్కు ఏర్పాటు చేశారు. ఈ పార్కులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25వేల జాతుల మొక్కలను ఉంచారు. ఇందులో 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్​ను ఏర్పాటు చేశారు. రాందేవ్​రావు ఆరున్నరేళ్లుగా పాటు శ్రమించి ఈ పార్క్​ను తీర్చిదిద్దారు. ఇందులో రూ.లక్ష నుంచి రూ.3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలు ఉన్నాయి. ఇప్పటికే అరుదైన వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు. కాగా రాష్ట్రంలో రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్టు కలిగిన ఏకైకా పర్యాటక ప్రాంతంగా ఎక్స్​పీరియం పార్కు ఉంది. ఇందులో రూ.5 లక్షల నుంచి రూ.కోటి విలువైన శిల్పాలు ఉన్నాయి. చెట్లతో చేసిన అత్యధిక సజీవ శిల్పాలున్న ఏకైక కేంద్రంగా ఎక్స్​పీరియం పార్కు నిలిచింది.

తెలంగాణలో 'అరకు' అందాలు! : గఢ్​పూర్​ జంగిల్​ సఫారీ - చూసేందుకు రారమ్మంటోంది

ఆ రోగుల కోసం హైదరాబాద్​లో హెల్త్​ హబ్​ - అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు

Last Updated : Jan 28, 2025, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.