Dumping Yard Problems In Hanamkonda : హనుమకొండ జిల్లా మడికొండలోని డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న విషపూరిత రసాయనాలు, పొగ నుంచి తమ ప్రాణాలను కాపాడాలని మడికొండ పరిసర గ్రామస్థులు సోమవారం కలెక్టర్ ప్రావిణ్యను వేడుకున్నారు. యార్డు నుంచి వచ్చే విషపూరితమైన దుమ్ము, ధూళి, దుర్వాసనలతో శ్వాసకోశ, చర్మ వ్యాదులు వస్తున్నాయని వాపోయారు.
పథకాలు వద్దు - ప్రాణాలు కాపాడితే చాలు : తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వద్దని, ప్రాణాలు కాపాడితే చాలని వేడుకున్నారు. మడికొండ,రాంపూర్ గ్రమాల మధ్య ఉన్న డంపింగ్ యార్డు నుంచి విషపూరితమైన రసాయనాలు యార్డులోని కాలువల ద్వారా మడికొండ పెద్ద చెరువు, సల్ల చెరువు కుంటల్లో చేరుతున్నాయి. పెద్ద చెరువులో గ్రామానికి తాగు నీరు అందించే బావి సైతం విషపూరితమైతుంది.
డంపింగ్‌యార్డు : ఇందులోని విషపూరితమైన నీటిని గుట్టపై ఉన్న ట్యాంక్‌లోకి పంపింగ్ చేసి మిషన్ భగీరథ నీటితో కలిపి సరఫరా చేస్తున్నారు. దీంతో ఇక్కడ నివసిస్తున్న ప్రజలు రోగాలతో ఇబ్బందిపడుతున్నారు. అధికారులకు దీని గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాంపూర్ డంపింగ్ యార్డు ఎత్తివేయాలని పలు గ్రామాల ప్రజలు కమిషనర్ డా.అశ్విని తానాజీని కోరారు. బల్దియా సమావేశ మందిరం ఎదుట కొద్దిసేపు నిరసన తెలిపారు.
బహిరంగ ప్రదేశంలో చెత్తకు నిప్పు- ఊపిరాడక స్థానికులు ఉక్కిరిబిక్కిరి