ETV Bharat / state

మద్యం మత్తులో డయల్ 100కి 7 సార్లు ఫోన్ - కట్ చేస్తే - DRUNK MAN CALLS DIAL 100

పోలీసులకు, బాధితులకు మధ్య ఓ వారధిగా పని చేస్తోన్న డయల్ 100ను దుర్వినియోగం చేస్తున్న ఆకతాయిలు - మద్యం మత్తులో డయల్ 100కి ఫోన్ - 4 రోజుల జైలు శిక్ష విధించిన మేజిస్ట్రేట్

Drunk Man Calls Dial 100 in Nizamabad District
Drunk Man Calls Dial 100 in Nizamabad District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2025, 3:47 PM IST

Drunk Man Calls Dial 100 in Nizamabad District : ఆపదలో ఉన్నవారిని ఆదుకోడానికి ముందుగా నిలిచేది డయల్ 100. ఏ తరహా ఇబ్బంది ఎదురైనా వెంటనే 100కు కాల్ చేయాలని పోలీసులు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు. పోలీసులకు, బాధితులకు మధ్య ఓ వారధిగా పని చేస్తోంది 100. ఎప్పుడు ఫోన్ వచ్చింది, ఘటనా స్థలానికి ఎప్పుడు చేరుకున్నారనే విషయాలను పరిశీలించడానికి ఓ వ్యవస్థనూ ఏర్పాటు చేశారు.

నిత్యం పోలీసుల పర్యవేక్షణలో ఉండే డయల్ 100కు ఈ మధ్య ఫేక్ కాల్స్ అధికమవుతున్నాయి. అనవసరంగా కాల్స్ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేస్తున్నారు. వాళ్లు చెప్పేది నిజమో అబద్ధమో తెలియక ఒకవేళ నిజమేమోనని భావించి ఆ ప్రాంతానికి వెళ్తోన్న పోలీసులకు అది అబద్ధమని తెలుస్తోంది. ఇటువంటి ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

మద్యం మత్తులో డయల్ 100కి 7 సార్లు ఫోన్ : జిల్లాలోని వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన పులి సచిన్ (37) మద్యం తాగాడు. ఆ మైకంలో డయల్ 100కు సోమవారం రాత్రి 10:30 నుంచి మధ్యరాత్రి ఒంటిగంట వరకు 7 సార్లు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన ప్రతీసారి తన వివరాలు చెప్పకుండా పోలీసుల విలువైన సమయాన్ని దుర్వినియోగం చేశాడు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ నెంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆర్మూర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరచగా పులి సచిన్​కు మేజిస్ట్రేట్ జి.గంగారెడ్డి 4 రోజుల జైలు శిక్ష విధించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగపడే డయల్ 100ను అవసరానికి మాత్రమే వినియోగించాలని ప్రజలకు సూచించారు. ఎవరైనా దుర్వినియోగానికి ఉపయోగిస్తే కఠన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చట్టపరంగా శిక్ష తప్పదంటున్న పోలీసులు : పోలీసులు సరిగ్గా విధులు నిర్వహిస్తున్నారా లేదా అని ఒకరు, ప్రియురాలి మీద కోపంతో మరొకరు, భార్య మీద అలక వహించి ఇంకొకరు ఒక్కో సందర్భంలో డయల్ 100కు నకిలీ ఫోన్లు వస్తున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. ఫేక్ కాల్స్ చేసే వాళ్లకు చట్టపరంగా శిక్ష తప్పదు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

లిఫ్ట్ చేస్తారో లేదోనని.. డయల్ 100కు ఫేక్ కాల్స్

'ఇకపై ఆటపట్టించాలని చూస్తే... ఆటాడిస్తారు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.