The Car With The Congress MLA Sticker is Being Driven Suspiciously : ములుగు జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజులుగా ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అనసూయ స్టిక్కరింగ్తో ఓ కారు అక్రమంగా తిరుగుతోంది. ఆ కారులో బీజేపీ కండువా ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆ కారు కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, సీతక్క సూచన మేరకు కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్‌తో పాటు నాయకులు సోమవారం ములుగు పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకటేశ్వరావుకు ఫిర్యాదు చేశారు.
Misuse MLA sticker: ఎమ్మెల్యే స్టిక్కరుంటే.. ఎవరూ ఆపరనే ధీమా!!
వెంటనే కారు యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే సంబంధిత వ్యక్తిని పట్టుకుని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్సై వెంకటేశ్వ రావు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ ములుగు పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి, విద్యార్థి సంఘం నాయకులు మామిడిశెట్టి కోటి, ఐలయ్య, రమేష్, అభినవ్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యే స్టిక్కరింగ్ కలిగిన కారులో బీజేపీ కండువా కనిపించడం జిల్లాలో చర్చనియాంశంగా మారింది.
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. పసికందు మృతి.. వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్.!