ETV Bharat / business

2025లో జీతాలు 9.4శాతం పెరిగే ఛాన్స్ - అందరికన్నా ఆ ఉద్యోగులకే ఎక్కువ హైక్! - SALARY HIKE IN 2025

ఈ 2025లో ఉద్యోగుల వేతనాల్లో 9.4శాతం పెరిగే ఛాన్స్​ : సర్వే

Salary Hike In 2025
Salary Hike In 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2025, 7:36 PM IST

Salary Hike In 2025 : ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది మన దేశంలోని వివిధ రంగాల వేతన జీవులకు సగటున 9.4 శాతం మేర వేతనాలు పెరిగే అవకాశం ఉంది. హెచ్‌ఆర్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెర్సర్’ నిర్వహించిన టోటల్ రెమ్యునరేషన్ సర్వే (టీఆర్ఎస్)లో ఈ అంశాన్ని గుర్తించారు. గత ఐదేళ్లుగా భారతదేశంలో ఉద్యోగుల వేతనాలు క్రమంగా పెరుగుతున్నాయని వెల్లడైంది. ఈ క్రమంలోనే 2020 సంవత్సరంలో 8 శాతం మేర వేతనాలు పెరిగాయని గుర్తు చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో బలమైన వృద్ధి, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఉన్న డిమాండ్ కారణంగా వేతనాల పెంపునకు కంపెనీలు సిద్ధపడుతున్నాయని సర్వే నివేదికలో ప్రస్తావించారు. ఈ సర్వేలో భారత్‌లోని 1,550కిపైగా కంపెనీలు పాల్గొన్నాయి. ఇవన్నీ విభిన్న రంగాలకు చెందినవి. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కన్జ్యూమర్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసులు, తయారీ రంగం, వాహన రంగం, ఇంజినీరింగ్ రంగాల కంపెనీలను సర్వే చేశారు.

వాహన రంగం టాప్
ఈ ఏడాది వేతనాల పెంపులో వాహన రంగం ముందంజలో ఉంటుందని ‘మెర్సర్’ సంస్థ సర్వే నివేదిక తెలిపింది. ఈ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాల పెంపు 8.8 శాతం నుంచి 10 శాతం దాకా ఉండొచ్చని పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ‘మేకిన్ ఇండియా’ మిషన్ అనేవి వాహన రంగానికి ఊతమిస్తున్నాయని నివేదిక తెలిపింది.

రెండో స్థానంలో మాన్యుఫాక్చురింగ్​ -ఇంజినీరింగ్ రంగం
వేతనాల పెంపులో రెండో స్థానంలో తయారీ-ఇంజినీరింగ్ రంగం ఉంది. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఏడాది 8 శాతం నుంచి 9.7 శాతం మేర వేతనాలు పెరిగే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. తయారీ రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఇందుకు ఊతం ఇవ్వనున్నాయి.

సర్వే నివేదికలోని కీలక అంశాలివే!

  • ఈ ఏడాది భారత్‌లోని చాలా కంపెనీలు ఉద్యోగ నియామకాలను చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ సర్వేలో పాల్గొన్న 37 శాతం కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కార్మికులను భర్తీ చేసుకునేందుకు కంపెనీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి.
  • ఈ ఏడాది వివిధ రంగాల కంపెనీల నుంచి దాదాపు 11.9 శాతం మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలగే అవకాశం ఉంది.
  • 2025లో వ్యవసాయ-రసాయన పరిశ్రమల నుంచి 13.6 శాతం మంది ఉద్యోగులు, షేర్డ్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ల నుంచి 13 శాతం మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలగే అవకాశం ఉంది. ఆయా రంగాల్లో నిపుణులకు భారీ డిమాండ్ ఉన్నందువల్లే ఈ విధంగా ఉద్యోగుల వలసలకు ఆస్కారం ఏర్పడనుంది.
  • ఈ సంవత్సరంలో తమ ఉద్యోగులకు ‘పనితీరు ఆధారిత వేతనాల చెల్లింపు’ పద్ధతిని అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నామని సర్వేలో పాల్గొన్న 75 శాతానికిపైగా కంపెనీలు తెలిపాయి.

TCSలో 40,000 ఉద్యోగాలు - ఏఐ, కోడింగ్ నైపుణ్యాలు మస్ట్ - త్వరలోనే ప్రకటన!

లైఫ్​లాంగ్​ ఆర్థికంగా స్ట్రాంగ్​గా, సేఫ్​గా ఉండాలా? ఈ టాప్​-5 మనీ రూల్స్ మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.