ETV Bharat / offbeat

అద్దిరిపోయే రుచితో "పనీర్​ షావర్మా" - ఇలా ప్రిపేర్ చేస్తే బయట కొనాల్సిన అవసరం ఉండదు! - PANEER SHAWARMA RECIPE

మీకు షావర్మా అంటే ఇష్టమా? - ఇంట్లోనే ఈజీగా పనీర్​తో ప్రిపేర్ చేసుకోండిలా!

SHAWARMA WITH PANEER
Paneer Shawarma Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2025, 3:01 PM IST

Paneer Shawarma Recipe in Telugu : పనీర్‌తో ఏం చేసినా ఇంటిల్లిపాదీ చాలా ఇష్టంగా తింటుంటారు. రోటీ, పులావ్‌, బిర్యానీ ఇలా దేనికైనా పనీర్​తో​ చేసే వంటకాలు పర్ఫెక్ట్​గా కాంబినేషన్​గా నిలుస్తాయి. మీరూ ఇప్పటి వరకు పనీర్​తో రకరకాల రెసిపీలు ట్రై చేసి ఉంటారు. అయితే, ఎప్పుడూ రొటీన్​వే కుండా ఓసారి కాస్త వెరైటీగా ఇలా "పనీర్ షావర్మా"ను ప్రయత్నించి చూడండి. ఇంట్లోనే సులభంగా చేసుకునే ఈ షావర్మా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు! మరి, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మైదా - రెండున్నర కప్పులు
  • యాక్టివ్ డ్రై ఈస్ట్ - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పంచదార - ఒక టీస్పూన్
  • నూనె - 2 టీస్పూన్లు

స్టఫింగ్ కోసం :

  • పనీర్ - 300 గ్రాములు
  • పెరుగు - 1 టేబుల్​స్పూన్
  • బార్బెక్యూ సాస్ - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
  • కారం - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వేయించిన జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • మిరియాల పొడి - అరటీస్పూన్
  • నిమ్మరసం - 1 టీస్పూన్
  • గరంమసాలా - అరటీస్పూన్
  • బీట్​రూట్స్ - 2
  • క్యాప్సికం - 2
  • వెనిగర్ - తగినంత
  • ఉల్లిపాయ - 1(పెద్ద సైజ్​ది)
  • పచ్చిమిర్చి - 4
  • చక్కెర - 1 టీస్పూన్
  • కీరదోసకాయ - 1
  • మయోనైజ్ - అరకప్పు
  • చల్లని పెరుగు - ముప్పావు కప్పు
  • వెల్లుల్లి రెబ్బలు - 3
  • లెట్యూస్ ఆకులు - కొన్ని

తయారీ విధానం :

  • ముందుగా ఒక మిక్సింగ్ బౌల్​లో మైదా, యాక్టివ్ డ్రై ఈస్ట్, పంచదార, ఉప్పు, నూనె వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత తగినన్ని గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త సాఫ్ట్​గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే, పిండి కాస్త స్టిక్కీగా, జిగురుగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక దాన్ని ఒక గంటపాటు పక్కనుంచాలి.
  • ఈలోపు స్టఫింగ్​ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా పనీర్ బ్లాక్​ని తీసుకొని పావు ఇంచు మందంతో సన్నని స్లైసులు​గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్​లో పెరుగు, బార్బెక్యూ సాస్, అల్లంవెల్లుల్లి పేస్ట్, అరటీస్పూన్ కారం, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం, గరంమసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కట్ చేసుకున్న పనీర్ స్లైసులను వేసి బాగా కోట్ చేసి పావుగంట పాటు పక్కనుంచాలి.
  • అనంతరం స్టౌపై ఒక గిన్నె పెట్టి వాటర్​ పోసి అందులో స్టీమింగ్ ప్లేట్​ ఉంచాలి. ఆపై దానిలో సన్నని స్ట్రిప్స్ మాదిరిగా కట్ చేసుకున్న బీట్​రూట్​, క్యాప్సికం ముక్కలు వేసి మూతపెట్టి హై ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మరో బౌల్​లో పావు కప్పు వెనిగర్, పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని అందులో కుక్ చేసుకున్న బీట్​రూట్ ముక్కలు వేసి అరగంట పాటు నాననివ్వాలి.
  • ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ చీలికలు, పొడవుగా, సన్నగా తరుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 టేబుల్​స్పూన్ల వెనిగర్, అరటీస్పూన్ సాల్ట్, పంచదార, చెక్కు తీసి ఫ్రెంచ్ ప్రైస్ మాదిరిగా కట్ చేసుకున్న కీర దోస ముక్కలు, ముప్పావు కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపి దీన్ని కూడా 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
  • అనంతరం గ్రిల్ పాన్ మీద ముందుగా కోట్ చేసి పక్కన పెట్టుకున్న పనీర్ స్లైసు​లను ఉంచి మీడియం ఫ్లేమ్ మీద గ్రిల్ చేసుకోవాలి. రెండు వైపులా క్రిస్పీగా అయ్యాక తీసి పక్కనుంచాలి.
  • ఆ తర్వాత మరో గిన్నెలో మయోనైజ్, గడ్డ పెరుగు, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, సన్నని వెల్లుల్లి తరుగు, కొద్దిగా ఉప్పు, పావుటీస్పూన్ కారం వేసుకొని తరకలుగా లేకుండా మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు గంటసేపు నానబెట్టిన పిండిని తీసుకొని మరోసారి చేతితో బాగా వత్తుకొని సమాన ఉండలుగా చేసుకోవాలి.
  • ఆపై చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండిని వేసుకొని కాస్త మందంగా ఉండేలా చపాతీలా రోల్ చేసుకోవాలి.
  • అనంతరం స్టౌపై దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెనం వేడయ్యాక రోల్ చేసుకున్న చపాతీని వేసి చక్కగా కాల్చుకోవాలి. అలా అన్ని రోటీలను కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత చల్లారిన గ్రిల్డ్​ పనీర్ స్లైస్​లను స్ట్రిప్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి. అలాగే అరగంటపాటు నానిన ఉల్లిపాయ, బీట్​రూట్ ముక్కల్లోని వాటర్ వడకట్టి పక్కనపెట్టుకోవాలి.
  • ఇప్పుడు కాల్చుకున్న ఒక రోటీని తీసుకొని ఒక టేబుల్​స్పూన్ పెరుగు మిశ్రమం వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆపై రెండు, మూడు లెట్యూస్ ఆకులు రోటీపై ఉంచి పనీర్ స్ట్రిప్స్ సర్దుకోవాలి. ఆ తర్వాత కొన్ని బీట్​రూట్, క్యాప్సికం ముక్కలు, వడకట్టుకున్న ఉల్లి, కీర ముక్కలు చక్కగా సర్దుకొని వాటన్నింటిపై కొద్దిగా పెరుగు మిశ్రమం వేసుకోవాలి.
  • ఇలా అన్నీ సర్దుకున్నాక రోటీతో స్టఫింగ్​ని గట్టిగా లోపలికి తోస్తూ రోల్ చేయాలి. అప్పుడు షావర్మా పర్ఫెక్ట్​గా, స్టిఫ్​గా ఉంటుంది. రోల్ చేసుకున్నాక బటర్ పేపర్ చుట్టుకొని అంచుల్నీ ముడిచేస్తే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "పనీర్ షావర్మా" రెడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.