పైన కొండ.. కింద నది.. మధ్యలో శునకం.. చివరకు ప్రాణాలు దక్కాయిలా... - హిమాచల్‌ప్రదేశ్ కుల్లూ
🎬 Watch Now: Feature Video

Sonu Thakur Rescued Dog: కొండ మధ్యలో చిక్కుకున్న శునకాన్ని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడిన ఘటన హిమాచల్ ప్రదేశ్ కుల్లూలో వెలుగుచూసింది. మణికర్ణ్ వ్యాలీలోని రుద్రనాగ్ వద్ద ఓ కొండ అడుగుభాగాన కుక్క చిక్కుకుంది. కింద నది ఉండటం వల్ల ముందుకు వెళ్లలేక, పైకి ఎక్కలేక ఆపసోపాలు పడుతుంది. పాములు పట్టడంలో నేర్పరి అయిన సోను ఠాకుర్ ఇది గమనించి.. తన బృందంతో కలిసి ప్రాణాలకు తెగించి కుక్కను రక్షించాడు. 200 అడుగుల కొండపైనుంచి తాళ్ల సాయంతో కిందికి దిగి శునకాన్ని పైకి తీసుకెళ్లాడు. ఈ సాహసోపేత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సోనూను అంతా ప్రశంసిస్తున్నారు. గతంలో దాదాపు 600కుపైగా పాములను రక్షించి అడవిలో వదిలిపెట్టాడు సోను.