బైక్‌ను వేగంగా ఢీకొట్టిన కారు.. గాల్లో పల్టీలు కొట్టిన రైడర్ - Columbia Hospital Ghaziabad
🎬 Watch Now: Feature Video
దిల్లీలోని గాజియాబాద్‌లో సినిమా స్టంట్‌ను తలపించేలా ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు.. బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ రైడర్ కొన్ని సెకండ్ల పాటు గాల్లో పల్టీలు కొట్టాడు. అనంతరం కారు పైకప్పు మీద పడి.. కిందకు జారిపోయాడు. దీంతో ఆ రైడర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉండటం వల్ల.. అతడికోసం గాలిస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.