యువకుడిపై కార్మికుల కర్కశత్వం.. తాళ్లతో కట్టి.. ఆపై చితకబాది - యువకుడిపై దాడి
🎬 Watch Now: Feature Video
భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఇనుప చువ్వలు దొంగలించాడనే అనుమానంతో ఓ 17 ఏళ్ల యువకుడిపై కర్కశత్వం ప్రదర్శించారు కార్మికులు. సిమెంట్ మిక్సింగ్ మిషన్‌కు యువకుడిని తాళ్లతో కట్టేసి దారుణంగా కొట్టి హింసించారు. మే 31న మహారాష్ట్ర ముంబ్రాలో జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.. మిగతావారి కోసం గాలిస్తున్నారు. ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. బాలుడ్ని మిక్సింగ్ మిషన్‌కు కట్టేసి ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.