ETV Bharat / sports

'చిల్ ఆర్సీబీ ఫ్యాన్స్!- ట్రోఫీ మీదే!' - ట్రోలర్స్​కు కుల్​దీప్​ స్ట్రాంగ్ కౌంటర్ - KULDEEP YADAV ON RCB

చిల్ ఆర్సీబీ ఫ్యాన్స్!- ట్రోఫీ మీదే - ట్రోల్స్​పై స్పందించిన కుల్​దీప్​ యాదవ్

Kuldeep Yadav
Kuldeep Yadav (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 25, 2025, 8:55 AM IST

Kuldeep Yadav On RCB : కప్​ గెలవన్నప్పటికీ ఐపీఎల్​లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్​ ఉన్న టీమ్స్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఇండియాలోనే కాకుండా వరల్డ్​వైడ్​గా ఈ జట్టుకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఈ జట్టులో సత్తా చాటినప్పటికీ తుది పోరు వరకూ నెట్టుకు రాలేకపోయారు. దీంతో ఈ ఫ్రాంచైజీ ఇప్పటివరకూ కప్​ను ముద్దాడలేకపోయింది. అయితే తాజాగా టీమ్ఇండియా స్పిన్నర్ కుల్​దీప్​ యాదవ్ ఆర్సీబీపై సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అతడు ఏమన్నాడంటే?

ఇటీవల ఓ ప్రముఖ స్పోర్ట్స్ యూట్యూబ్​ ఛానల్​కు చెందిన లైవ్ సెషన్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ ఆర్సీసీబీ ఫ్యాన్​ కుల్​దీప్​ తమ జట్టులో చేరాలని కోరాడు. "బెంగుళూరు ఫుట్‌బాల్ టీమ్​లో గోల్ కీపర్‌ పోస్ట్ ఖాళీగా ఉంది దానికోసం మీరు టీమ్​లో చేరాలి" అని అన్నాడు. దానికి కుల్​దీప్​ సెటైరికల్​గా బదులిచ్చాడు.

"తుమ్హే గోల్ కీపర్​కీ నహీ, ట్రోఫీకీ జరూరత్ హై మేరే భాయ్. గోల్ కీపర్​కా క్యా కరోగే? (మీకు గోల్ కీపర్ అవసరం లేదు. మీకు ట్రోఫీ కావాలి. గోల్ కీపర్‌తో మీరు ఏమి చేస్తారు)" అని కుల్దీప్ అన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

అయితే కుల్​దీప్​ ఇచ్చిన ఈ ఆన్సర్​ వల్ల నెట్టింట ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అతడ్ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో కుల్​దీప్​ వారిని కూల్​ చేసేందుకు ప్రయత్నించాడు. "చిల్ ఆర్సీబీ ఫ్యాన్స్. ట్రోఫీ మీదే. కానీ నేను గోల్‌కీపర్ కాదు. అని ట్వీట్​ చేశాడు. ఇప్పుడు ఇది​ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.