Maruti Suzuki Price Hike: ఈ ఏడాది కొత్త కారు కొనాలనుకునేవారికి అలెర్ట్. మరికొన్ని రోజుల్లో మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ఫిబ్రవరి 1, 2025 నుంచి తన కార్లు, SUVల ధరలను పెంచబోతున్నట్లు దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ప్రకటించింది. కార్ల మోడల్స్ ఆధారంగా ఈ ధరలు పెరగనున్నాయి. వీటి పెంపు కనిష్ఠంగా రూ.1,500 నుంచి గరిష్ఠంగా రూ.32,500 వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. పాత మారుతి సియాజ్, మారుతి జిమ్మీ ధరలను అత్యల్పంగా పెంచగా మారుతి సెలెరియో, ఇన్విక్టో వంటి మోడళ్ల ధరలను రూ.30,000 వరకు పెంచనున్నట్లు సమాచారం.
మోడల్‌ను బట్టి కార్లపై ధరల పెంపు వివరాలు:
Model | Price Hike |
Maruti Alto K10 | రూ. 19,500 వరకు పెంపు |
Maruti S-Presso | రూ. 5,000 వరకు పెంపు |
Maruti Celerio | రూ. 32,500 వరకు పెంపు |
Maruti Wagon R | రూ. 15,000 వరకు పెంపు |
Maruti Swift | రూ. 5,000 వరకు పెంపు |
Maruti Dzire | రూ. 10,000 వరకు పెంపు |
Maruti Brezza | రూ. 20,000 వరకు పెంపు |
Maruti Ertiga | రూ. 15,000 వరకు పెంపు |
Maruti Eeco | రూ. 12,000 వరకు పెంపు |
Maruti Ignis | రూ. 6,000 వరకు పెంపు |
Maruti Baleno | రూ. 9,000 వరకు పెంపు |
Maruti Ciaz | రూ. 1,500 వరకు పెంపు |
Maruti XL6 | రూ. 10,000 వరకు పెంపు |
Maruti Fronx | రూ. 5,500 వరకు పెంపు |
Maruti Invicto | రూ. 30,000 వరకు పెంపు |
Maruti Jimny | రూ. 1,500 వరకు పెంపు |
Maruti Grand Vitara | రూ. 25,000 వరకు పెంపు |
ఇక ఫోర్త్ జనరేషన్ మారుతి డిజైర్‌ను కంపెనీ ప్రారంభ ధరకు విడుదల చేసింది. ఇప్పుడు ఈ ధర పంపుతో దాని ప్రారంభ ధర ముగియనుంది. గతేడాది చివర్లో లాంఛ్ చేసిన ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్ ధరలు కొత్త సంవత్సరంతో రూ. 10,000 వరకు పెరిగాయి. మరోవైపు మారుతి బ్రెజ్జా, ఫ్రాంక్స్, స్విఫ్ట్, ఎర్టిగా వంటి ఇతర ప్రముఖ మోడళ్ల ధరలు రూ.20,000 వరకు పెరగనున్నాయి. వీటన్నింటితో పాటు మారుతి సెలెరియో ధర అత్యధికంగా పెరుగుతుంది. వేరియంట్‌ను బట్టి ఇది రూ.32,500 వరకు పెంచనున్నారు. అదే సమయంలో మారుతి సుజుకి ఇన్విక్టో ధర రూ.30,000 వరకు పెరుగుతుంది.
స్టన్నింగ్ లుక్‌లో 'కీవే K300 SF' లాంఛ్- ఏకంగా రూ.60వేల తగ్గింపు ధరతో- వారికి మాత్రమే!
క్యాబ్, రూట్ ఒకటే అయినా ఫోన్ మోడల్‌ను బట్టి ఛార్జీలేసుడేందీ?- ఉబర్ సమాధానమిదే!
ఫ్లాగ్‌షిప్ పెర్ఫార్మెన్స్తో 'ఐకూ నియో 10R' ఫోన్- గేమింగ్ లవర్స్‌కు ఇక పండగే!