This Week Movie Releases : ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. ఇక ఈ వారం మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందకు రెడీ అవుతున్నాయి. అలాగే ప్రేక్షకులను మరిన్ని చిత్రాలు ఓటీటీల్లో అలరించేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఏంటో చూద్దాం.
13ఏళ్ల తర్వాత
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ లీడ్‌లో తెరకెక్కిన సినిమా 'మదగజరాజు'. ఈ సినిమా 2012లోనే పూర్తైనప్పటికీ పలు కారణాల వల్ల విడుదల 13ఏళ్లు ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు గతవారం తమిళ్లో రిలీజైన ఈ సినిమా డీసెంట్ విజయం అందుకుంది. దీంతో ఈ వారం తెలుగు ప్రేక్షకులకను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 31న సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగులో విడుదల కానుంది. అంజలీ, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటించారు. సుందర్.సి దర్శకత్వం వహించారు.
రాచరికం
వరుణ్ సందేశ్ కీలక పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'రాచరికం'. విజయ్ శంకర్, అప్సరా రాణి ఆయా పాత్రలు పోషించారు. సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం 31న థియేటర్లలోకి రానుంది.
మహిష
కె.వి.ప్రవీణ్, యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మహిష'. దర్శకుడు కె.వి.ప్రవీణ్ తెరకెక్కించారు. ఈ నెల 31న గ్రాండ్‌గా విడుదల కానుంది.
రిలీజైన వారానికే
మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న మిస్టరీ థ్రిల్లర్ 'ఐడెంటిటీ'. టొవినో థామస్, త్రిష లీడ్ రోల్స్‌లో అఖిల్ పాల్, అనాస్‌ఖాన్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రమిది. జనవరి 24న తెలుగులో విడుదలైంది. అయితే థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక జీ5లో జనవరి 31వ తేదీ నుంచి తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో ఈ మూవ అందుబాటులోకి రానుంది.
ఓటీటీలోకే నేరుగా
పృథ్వీ, విస్మయ శ్రీ , శత్రు, ఆడుకాలం నరేన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'పోతుగడ్డ'. రక్ష వీరమ్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో జనవరి 30వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
అమెజాన్‌ప్రైమ్
- ర్యాంపేజ్ (హాలీవుడ్) జనవరి 26
- ట్రెబ్యునల్ జస్టిస్2 (వెబ్‌సిరీస్)జనవరి 27
- బ్రీచ్ (హాలీవుడ్) జనవరి 30
- ఫ్రైడే నైట్ లైట్స్ (హాలీవుడ్) జనవరి 30
నెట్‌ఫ్లిక్స్
- లుక్కాస్ వరల్డ్ (హాలీవుడ్) జనవరి 31
- ది స్నో గర్ల్2 (వెబ్‌సిరీస్) జనవరి 31
జియో సినిమా
- ది స్టోరీ టెల్లర్ (హిందీ) జనవరి 28
- ఆపిల్ టీవీ ప్లస్
- మిథిక్ క్వెస్ట్ (వెబ్‌సిరీస్) జనవరి 29
సోనీలివ్
- సాలే ఆషిక్ (హిందీ)ఫిబ్రవరి 1
వీకెండ్ స్పెషల్ ఒక్క రోజే 25 సినిమా/సిరీస్‌లు - ఆ 12 వెరీ స్పెషల్