ETV Bharat / technology

వివో నుంచి అదిరిపోయే స్మార్ట్​ఫోన్లు- లాంఛ్​కు ముందే స్పెక్స్ లీక్! - VIVO V50 AND VIVO Y19E INDIA LAUNCH

త్వరలో దేశీయ మార్కెట్లోకి 'వివో V50', 'వివో Y19e' ఫోన్లు- డీటెయిల్స్ ఇవిగో!

Picture of Vivo V40
Picture of Vivo V40 (Photo Credit- VIVO)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 26, 2025, 2:20 PM IST

Vivo V50 and Vivo Y19e India Launch: ఇండియన్ మార్కెట్లోకి వివో నుంచి అదిరే స్మార్ట్​ఫోన్లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. కంపెనీ 'వివో V50', 'వివో Y19e' పేర్లతో మరికొన్ని నెలల్లో వీటిని లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించాయి. ఈ సందర్భంగా ఈ రెండు స్మార్ట్​ఫోన్​లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

వివో నుంచి రెండు కొత్త ఫోన్లు: మై స్మార్ట్ ప్రైస్ నివేదిక ప్రకారం 'వివో V50', 'వివో Y19e' కొత్త ఫోన్​లు వరుసగా 'V2427', 'V2431' మోడల్ నంబర్లతో కనిపించాయి. 'V2427' మోడల్​ నంబర్ ముందుగా NBTC సర్టిఫికేషన్‌ జాబితాలో చేరింది. ఈ మోడల్ నంబర్ 'వివో V50' స్మార్ట్​ఫోన్​దే అని తెలుస్తోంది.

ఇక 'వివో Y19e' పేరుతో 'V2431'ను విడుదల చేయనున్నట్లు IMEI డేటాబేస్ ద్వారా వెల్లడైంది. ఇప్పుడు వీటి BIS సర్టిఫికేషన్ వివో ఈ రెండు కొత్త ఫోన్‌లను భారతదేశంలో లాంఛ్ చేస్తుందని నిర్ధారించింది. అయితే సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్‌ల మిగిలిన వివరాల గురించి మాత్రం ఎటువంటి సమాచారం అందలేదు.

బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్: 'వివో V50' స్మార్ట్​ఫోన్​ను NCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్​లో కూడా లిస్ట్ చేశారు. దీని ద్వారా ఈ ఫోన్​కు సంబంధించిన కొన్ని మెయిన్ స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. NCC డేటాబేస్ ప్రకారం ఈ ఫోన్‌ను డీప్ బ్లూ, గ్రే, వైట్ షేడ్స్ కలర్ ఆప్షన్లలో లాంఛ్ చేయొచ్చు. ఈ ఫోన్‌లో 5870mAh బ్యాటరీ ఇవ్వొచ్చు. అంతేకాక ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావచ్చు.

సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో ఉన్న ఈ ఫోన్​కు సంబంధించిన కొన్ని ఇమేజెస్​ను బట్టి కంపెనీ దీన్ని ఫ్లాట్ డిస్‌ప్లేతో తీసుకొస్తోందని తెలుస్తోంది. ఇది OLED ప్యానెల్‌తో రావచ్చు. దాని వెనక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వొచ్చు. ఇది ఆరా రింగ్ LED ఫ్లాష్ లైట్‌తో రావచ్చు. ఇటీవల చైనాలో లాంఛ్ అయిన 'వివో S20' రీబ్రాండెడ్ వెర్షన్‌గా 'వివో V50'ను కంపెనీ లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే వివో ఈ స్మార్ట్‌ఫోన్‌ల రిలీజ్​కు సంబంధించిన వివరాలను ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

కొత్త కారు కొనాలా?- అయితే వెంటనే త్వరపడండి- ఆలస్యం చేస్తే ఇక బాదుడే!

స్టన్నింగ్ లుక్​లో 'కీవే K300 SF' లాంఛ్- ఏకంగా రూ.60వేల తగ్గింపు ధరతో- వారికి మాత్రమే!

క్యాబ్, రూట్ ఒకటే అయినా ఫోన్​ మోడల్​ను బట్టి ఛార్జీలేసుడేందీ?- ఉబర్ సమాధానమిదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.