ETV Bharat / entertainment

SSMB29 షూటింగ్ స్టార్ట్! - 'సినిమా అప్​డేట్ ఇలా కూడా ఇస్తారా జక్కన్న!' - SSMB 29 RAJAMOULI UPDATE

SSMB29 లేటెస్ట్ అప్​డేట్​ - షూటింగ్‌ మొదలుపెట్టిన రాజమౌళి! - ఆ వీడియోతో హింట్ ఇచ్చేశారుగా

SSMB 29
SSMB 29 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2025, 8:04 AM IST

Updated : Jan 25, 2025, 9:26 AM IST

SSMB 29 Rajamouli Update : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు, డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రస్తుతం షూటింగ్​ పనుల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జక్కన్న ఈ సినిమా అప్​డేట్​ను విన్నూత్నంగా చెప్పారు. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను పంచుకున్నారు.

ఓ సింహాన్ని లాక్‌ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో చేశారు. అందులో ఆయన పాస్‌పోర్ట్‌ చూపిస్తూ నవ్వుతూ పోజ్‌ ఇచ్చారు. అంతేకాకుండా దానికి 'క్యాప్చర్‌' అనే క్యాప్షన్​ను జోడించారు. ఇక దీనికి మహేశ్‌ బాబు, ప్రియాంక చోప్రా రియాక్ట్ అయ్యారు. "ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను" అంటూ పోకిరి డైలాగును కామెంట్‌ చేశారు మహేశ్‌. 'ఫైనల్లీ అంటూ కామెంట్ చేసిన ప్రియాంక దానికి ఓ నవ్వుతున్న ఎమోజీని జోడించారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూస్తుంటే ఆయన ఇక సినిమా షూటింగ్‌ ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు ఉన్నారని అభిమానులు అనుకుంటున్నారు. బాబు సెట్స్​పైకి వచ్చే టైమ్​ స్టార్ట్ అయ్యిందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో 'సినిమా అప్​డేట్ ఇలా కూడా ఇస్తారా జక్కన్న!' అంటూ హిలేరియస్​గా అంటున్నారు. చాలా కొత్తగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.

ప్రియాంక ఫిక్స్‌!
ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భాగం కానున్నట్లు రూమర్స్ వచ్చాయి. దానికి తగ్గట్లుగా ఆమె తాజాగా హైదరబాద్​లోకి ల్యాండ్ అయ్యారు. ఆ సమయంలో తను ఈ ప్రాజెక్ట్‌ కోసమే వచ్చారని కామెంట్స్ కూడా వినిపించాయి. ఇప్పుడీ వీడియోకు ప్రియాంక కామెంట్ పెట్టడం వల్ల ఇందులో ప్రియాంక రోల్​ ఫిక్స్‌ అయిపోయిందని అభిమానులు అంటున్నారు. మరోవైపు రీసెంట్​గానే ఆమెకు లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయినట్లు సినీ వర్గాల సమాచారం.

సినిమా కథ విషయానికొస్తే, ఇక ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి తెరపై ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో దీనిపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి . అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని రీమేక్ చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేశ్‌ కనిపించనున్నారు.

'SSMB సినిమా ఏడాదిన్నరలోనే వచ్చేస్తుంది'- మహేశ్, రాజమౌళి ప్రాజెక్ట్​పై చెర్రీ కామెంట్స్

'SSMB' బడ్జెట్ రూ.1000కోట్లు- రూ.4వేల కోట్ల కలెక్షన్ పక్కా!

Last Updated : Jan 25, 2025, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.