Road Accident : వరంగల్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామునూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు వలస కూలీలు మృతి చెందారు. మృతులు బిహార్‌కు చెందిన వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో మహిళతో పాటు చిన్నారి ఉన్నట్లు తెలిపారు. గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కరీమాబాద్‌కు చెందిన సాగర్ అనే ఆటో డ్రైవర్‌కు రెండు కాళ్లు విరగ్గా, పూజ అనే మహిళ స్వల్పంగా గాయపడింది. ముఖేశ్ అనే మరో యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. లారీ వెనుక నుంచి 2 ఆటోలను బలంగా ఢీకొట్టి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదం వరంగల్-ఖమ్మం రహదారిపై జరగడం, లారీ అడ్డంగా పడిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 3 క్రేన్‌ల సహాయంతో సుమారు రెండు గంటల పాటు శ్రమించి రహదారిపై చెల్లాచెదురుగా పడిన ఇనుప స్తంభాలను తొలగించారు. మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎంజీఎం ఆసుపత్రిలో పరామర్శించారు. ఘటన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి నుంచి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి : వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు.
ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం : మరోవైపు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సైతం వరంగల్ రోడ్డు ప్రమాద ఘటనపై స్పందించారు. మామునూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇనుప స్తంభాల కింద ఇరుక్కున్న వారిని రక్షించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
ఆగి ఉన్న బస్సును ఢీకొన్న మినీ వ్యాన్- 9 మంది స్పాట్ డెడ్
మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘోర ప్రమాదం - దంపతులతో పాటు కుమార్తె స్పాట్ డెడ్