Tilak Varma T20 Records : చెన్నై చిదంబరం స్డేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సూపర్ హాఫ్ సెంచరీతో ఒంటిచేతితో విజయాన్ని అందించాడు. 72 పరుగులు బాది కష్టాల్లో ఉన్న జట్టును నుంచి విజయతీరాలను తీర్చాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
విరాట్ రికార్డు బ్రేక్
భారత్ తరఫున వరుసగా నాలుగు టీ20ల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు. 4 ఇన్నింగ్స్‌లో కలిపి తిలక్ 318 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా రన్ మెషీన్ కోహ్లీ (258 పరుగులు)ని అధిగమించాడు. ఈ జాబితాలో సంజూ శాంసన్ (257 పరుగులు), రోహిత్ శర్మ (253 పరుగులు), శిఖర్ ధావన్ (252 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ప్రపంచ రికార్డు బ్రేక్!
తాజా ఇన్నింగ్స్‌తో తిలక్ వరల్డ్ రికార్డ్ కూడా బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తిలక్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో నాటౌట్‌గా 72 పరుగులు బాదిన తిలక్, ఇంతకుముందు మూడు ఇన్నింగ్స్‌ల్లో 107*, 120*, 19*, 72* రన్స్ చేశాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్మన్ (271 రన్స్)ను అధిగమించాడు.
మ్యాచ్ అయ్యాకే తెలిసింది
'మ్యాచ్ ముగించడం ఆనందాన్ని ఇస్తుంది. సౌతాఫ్రికాలో మ్యాచ్ ఫినిష్ చేసే ఛాన్స్ వచ్చినా, చేయలేకపోయా. నేను నిరంతరం శ్రమిస్తూనే ఉంటా. కష్టపడడమే మన చేతుల్లో ఉంటుంది. మిగతాదంతా పైవాడు చూసుకుంటాడు. మరోవైపు రవి కూడా బాగా ఆడాడు. విలింగ్స్టోన్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఒత్తిడి తగ్గించాడు. నా మైండ్‌లో మ్యాచ్ ఫినిష్ చేయాలి అని ఒకటే ఫిక్స్ అయ్యా. మ్యాచ్ ముగిసిన తర్వాత చూశా నా స్కోర్ 72. నా జెర్సీ నెం కూడా 72. ఆ విషయం నాకు మ్యాచ్ ముగిసిన తర్వాతే తెలిసింది' అని తిలక్ అన్నాడు.
A game-changing flick 👌🏻
— BCCI (@BCCI) January 26, 2025
A number " 72" coincidence 🤔
a thrilling chepauk chase 🔝
..in the words of "won"der men - tilak varma & ravi bishnoi 😎
watch 🎥🔽 - by @28anand & @mihirlee_58 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank
చెన్నైలో దుమ్ముదులిపిన తెలుగోడు- రెండో T20లోనూ భారత్ గ్రాండ్ విక్టరీ
T20 సిరీస్ మొత్తానికి నితీశ్ రెడ్డి దూరం- షాక్‌లో SRH ఫ్యాన్స్!