LIVE : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి - REVANTH UNVEILS AMBEDKAR STATUE
🎬 Watch Now: Feature Video
Published : Jan 26, 2025, 11:50 AM IST
|Updated : Jan 26, 2025, 12:17 PM IST
CM Revanth Reddy Unveils Ambedkar Statue : హైదరాబాద్‌లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. అలాగే వర్సిటీలో పలు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు. అంతకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అంతకు సికింద్రాబాద్‌లోని వీరుల సైనిక్ స్మారక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సామర్థ్యాన్ని దేశానికి, ప్రపంచానికి చాటాలని గవర్నర్ పిలుపునిచ్చారు. అలాగే దేశవ్యాప్తంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు. అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సీఎం కీలక ఉపన్యాసం చేశారు.
Last Updated : Jan 26, 2025, 12:17 PM IST