LIVE : దిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - ప్రత్యక్షప్రసారం - REPUBLIC DAY 2025 CELEBRATIONS LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jan 26, 2025, 10:09 AM IST
|Updated : Jan 26, 2025, 12:30 PM IST
Republic Day 2025 LIVE : దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తివర్ణ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా భారత్ తన సైనిక సామర్థ్యాన్ని, ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణిని తొలిసారిగా రిపబ్లిక్ పరేడ్‌లో ప్రదర్శిస్తున్నారు. ఈసారి గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబో వో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్ పరేడ్‌లో 16 రాష్ట్రాలు, యూటీలు, 10 కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాలు పాల్గొన్నాయి. దిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే పరేడ్‌ను ప్రత్యక్షంగా 77 వేల మంది వీక్షిస్తున్నారు.
Last Updated : Jan 26, 2025, 12:30 PM IST