LIVE : పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - ప్రత్యక్షప్రసారం - TELANGANA REPUBLIC DAY 2025 LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jan 26, 2025, 9:09 AM IST
|Updated : Jan 26, 2025, 10:20 AM IST
Republic Day 2025 Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. పతాక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు సికింద్రాబాద్‌లోని వీరుల సైనిక్ స్మారక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సామర్థ్యాన్ని దేశానికి, ప్రపంచానికి చాటాలని గవర్నర్ పిలుపునిచ్చారు. అలాగే దేశవ్యాప్తంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ప్రభుత్వ పథకాలను ప్రారంభించనుంది.
Last Updated : Jan 26, 2025, 10:20 AM IST