ETV Bharat / state

ఊర్లో జరిగిన ఆ పెద్ద గొడవ - ఇల్లాలి ప్రాణం తీసే వరకు ఆగలేదు! - MEERPET MURDER CASE

మీర్‌పేట హత్య కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు - గురుమూర్తిని ఆయన నివాసానికి తీసుకెళ్లి తనిఖీ - ఇంట్లో రక్తపు ఆనవాళ్లు, వెంట్రుకలు స్వాధీనం

police investigation On Meerpet Murder Case
Meerpet Murder Case Update (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2025, 9:09 AM IST

Meerpet Murder Case Update : కలకలం సృష్టించిన మీర్‌పేట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 15న భార్యను హత్య చేసిన గురుమూర్తి, ఆనవాళ్లు తెలియకుండా మృతదేహాన్ని నరికి ముక్కలు చేసి, వేడి నీటిలో ఉడికించి ఎముకలు వేరు చేశాడు. అనంతరం శరీర భాగాలను స్టవ్‌పై కాల్చి బూడిద చేసి బాత్రూంలో ఫ్లష్‌లో పడేశాడు. ఎముకలను ఇనుప రాడ్‌ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేసి చెరువులో పడేసినట్లు గుర్తించిన పోలీసులు, అందుకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో మృతురాలు, గురుమూర్తి గ్రామంలో జరిగిన ఓ గొడవనే హత్యకు మూలకారణమని పోలీసులు భావిస్తున్నారు.

మీర్‌పేట హత్య కేసు : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడా వెంకటమాధవి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హత్య కేసు దర్యాప్తులో భాగంగా గురుమూర్తిని ఆయన ఇంటికి తీసుకెళ్లి ప్రతి గదిలో క్షుణ్నంగా పరిశీలించారు. శౌచాలయం వద్ద తల వెంట్రుకలు, వంట గదిలో రక్తపు మరకలు, రక్తం తుడిచినట్లు ఉన్న టిష్యూ పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నమూనాలను ఫోరెన్సిక్‌ కేంద్రానికి పంపారు. అక్కడ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా డీఎన్​ఏ పరీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. తనపై అనుమానం ఉంటే ఆధారాలు చూపాలంటూ పోలీసులతో వాదనకు దిగిన గురుమూర్తి, అనంతరం హత్యకు ముందు తలెత్తిన గొడవలు, మృతదేహాన్ని మాయం చేసేందుకు చేసిన ప్రయత్నాలను వివరించినట్టు సమాచారం.

ప్రకాశం జిల్లా రాచర్ల మండంలం జేపీ చెరువునకు చెందిన గురుమూర్తి, వెంకటమాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. రెండు కుటుంబాలు ఒకే గ్రామం కావటంతో దగ్గరి బంధుత్వాలున్నాయి. సొంతూరిలో శుభకార్యాలు, పండుగలకు దంపతులు వెళ్లి వస్తుండేవారు. మూడేళ్ల క్రితం సొంతూరు వెళ్లగా, గురుమూర్తి ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించగా పెద్ద గొడవ జరిగింది.

పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి విషయం పోలీసుల వరకి చేరకుండా వెంకటమాధవి కుటుంబ సభ్యులు సర్దుబాటు చేశారు. భర్త చేసిన పని గ్రామంలో పరువు తీసిందని మాధవి బాధపడేది. అదే విషయం పలుమార్లు కుటుంబ సభ్యులతో పంచుకొని కన్నీరు పెట్టుకునేది. భార్య తరపు కుటుంబం వల్లే తాను గ్రామానికి వెళ్లలేకపోతున్నట్టు గురుమూర్తి భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు. మూడేళ్లుగా ఏ పండక్కి కన్నవారి వద్దకు వెళ్లలేకపోతున్నామంటూ ఒకరిపై ఒకరు పరస్పరం నిందించుకునేంతగా గొడవలు చేరాయి.

గోడకేసి బాదటంతో : ఈ నెల 15న కనుమ పండగరోజు భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తారాసాయికి చేరింది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న గురుమూర్తి ఆమె తలను గోడకేసి బాదటంతో కిందపడి మరణించింది. మృతదేహం వద్ద కూర్చొని సుమారు 5 నుంచి 6 గంటలు ఆలోచించాడు. ఆనవాళ్లు తెలియకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు ఉన్న మార్గాలపై యూట్యూబ్‌లో వెతికాడు. అంతర్జాలంలో లభించిన సమాచారంతో వెబ్‌సీరిస్‌ చూశాడు. అక్కడి దృశ్యాలని ప్రేరణగా తీసుకొని మృతదేహాన్ని బాత్రూమ్‌కి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు.

ఆ ముక్కలను హీటర్‌లో : అనంతరం ఆ ముక్కలను హీటర్‌లో ఉడికించాడు. శరీరం నుంచి మాంసం, ఎముకలు వేరు చేశాడు. గ్యాస్‌స్టవ్‌పై మాంసపుముద్దను బూడిదగా మారేంత వరకి కాల్చి లెట్రిన్‌ సింక్‌లో వేసి ఫ్లష్‌చేశాడు. ఎముకలని ఇనుపరాడ్‌తో నలగగొట్టి పొడిగా మార్చి బకెట్‌లో ఉంచి జిల్లెలగూడ చెరువులో పారపోశాడు. ఆ తర్వాత తెలియదన్నట్లు తనతో గొడవపడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అత్తకి సమాచారమిచ్చాడు. అల్లుడిపై అనుమానంపై వచ్చిన అత్త మీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దారుణం బయటపడింది. తొలుత తనకేం తెలియదని బుకాయిస్తూ వచ్చిన గురుమూర్తి ఆనంతరం తానూ చేసిన ఘోరంపై నోరు విప్పుతున్నట్టు సమాచారం.

హత్యకు వినియోగించిన ఆయుధాలు స్వాధీనం : మీర్‌పేట్‌ హత్య కేసు దర్యాప్తు సవాల్‌గా మారడంతో ఆధారాలసేకరణలో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటివరకి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించే యత్నాల్లో ఉన్నారు. అనుమానితుడు చెప్పినట్టు మాధవి ఎముకలను ముక్కలుచేసి చెరువులో పడేసినట్టయితే అది ఎవరది అనేది నిరూపించటం పోలీసుల ముందున్న ప్రశ్న. ఘటనాస్థలంలో లభించిన ఆనవాళ్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి అవి మనిషి కళేబరం అనేది శాస్త్రీయంగా నిరూపణచేయాలి. వాటిని వెంకటమాధవి అవశేషాలని తేల్చేందుకు ఆమె తల్లిదండ్రులు, పిల్లల నుంచి డీఎన్​ఏ శాంపిల్‌ సేకరించి రెండింటిని విశ్లేషించి నిర్దారించాల్సి ఉంది. కీలకమైన కేసు కావటంతో రాచకొండ సీపీ సుధీర్‌బాబు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.

ఇప్పటి వరకి ఆమెది మిస్సింగ్‌ కేసుగానే : కేసును చేధించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు సీపీ వివరించారు. ఆధారాలు సేకరించేందుకు సాంకేతిక బృందాలని ఏర్పాటు చేశామని స్పష్టంచేశారు. ఒక వ్యక్తి చెప్పినట్లుగా అది వెంకట మాధవి మృతదేహమనే ఆనవాళ్లు నిర్దారించలేదన్నారు. ఇప్పటి వరకి ఆమెది మిస్సింగ్‌ కేసుగానే ఉందని సీపీ సుధీర్‌బాబు స్పష్టంచేశారు. భార్యను అత్యంత కిరాతకంగా హత్యచేసిన గురుమూర్తిని అత్యంత కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

'ఆమెతో కలిసి ఉండేందుకే' - మీర్‌పేట హత్య కేసులో సంచలన విషయాలు

మీర్‌పేట కేసులో కొత్త కోణం - గురుమూర్తి ఫోన్​లో ఉన్న ఆ మహిళ ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.