WC19: బాల్​ పోయింది.. కొద్దిసేపు ఆట ఆగింది

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 4, 2019, 7:51 AM IST

బుధవారం కివీస్​-ఇంగ్లాండ్​ మ్యాచ్​లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. న్యూజిలాండ్​ పేసర్​ హెన్రీ బౌలింగ్​లో.. జేసన్​ రాయ్​ కొట్టిన బంతి బౌండరీకి వెళ్లింది. అయితే.. పిచ్​ కవర్ల కిందకు వెళ్లిన బాల్​ ఎంత వెతికినా కనిపించలేదు. అక్కడి ఫీల్డర్​ సాంట్నర్, మైదాన సిబ్బంది చాలా సేపు బంతి కోసం శోధించారు. ఎంతకూ దొరకకపోవటం వల్ల అంపైర్లు వేరే బాల్​ తీసుకొచ్చారు. అయితే.. అప్పటికీ వెతుకుతూనే ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది బాల్​ను కనిపెట్టారు. అదే బంతితో స్వల్ప అంతరాయం అనంతరం ఆట కొనసాగించారు. ఈ మ్యాచ్​ గెలిచిన ఇంగ్లాండ్ 27 ఏళ్ల తర్వాత ప్రపంచకప్​ సెమీఫైనల్లోకి వెళ్లింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.