'నా డబ్బుల దండనే దొంగలిస్తావా?!'- దొంగను సినీఫక్కీలో ఛేజ్ చేసిన పెళ్లికొడుకు - MEERUT GROOM VIRAL VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Nov 25, 2024, 2:53 PM IST
Groom Chasing Thief In Meerut : మెడలో వేసుకున్న డబ్బుల దండ నుంచి నోట్లు దొంగిలించి పారిపోతున్న వ్యక్తిని ఓ పెళ్లికొడుకు సినీ ఫక్కీలో ఛేజ్ చేసి పట్టుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మేరఠ్‌లోని డుంగ్రావలీ గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లి జరుగుతుంది. అందులో భాగంగా సంప్రదాయంగా పెళ్లి కొడుకును గుర్రంపై ఊరేగిస్తున్నారు. అదే సమయంలో ఓ మినీ ట్రక్కును నడుపుతున్న డ్రైవర్ బండిని వరుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ట్రక్కు కిటికీ నుంచి బయటకు చేయి పెట్టి పెళ్లి కొడుకు మెడలోని నోట్ల దండను లాగి తెంచేశాడు. చేతికందిన నోట్లను తీసుకుని వాహనం వేగం పెంచాడు. కోపంతో ఊగిపోయిన పెళ్లి కొడుకు వెంటనే గుర్రం దిగి ఓ బైకుపై వాహనాన్ని వెంబడించాడు. ఆ మినీ ట్రక్కు ప్రయాణిస్తుండగానే దానిపైకి దూకి కిటికీ నుంచి లోపలికి వెళ్లి బండిని ఆపాడు. డ్రైవర్‌ను కిందకి దింపి స్థానికులతో కలిసి చితకబాదాడు.