ETV Bharat / health

రోజూ రాత్రి రీల్స్ చూస్తున్నారా? పరిశోధనలో కీలక విషయాలు- ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవట! - WATCHING REELS AT NIGHT SIDE EFFECT

-రాత్రి రీల్స్ చూసేవారికి రక్తపోటు ప్రమాదం -బ్రిటీష్ మెడికల్ జర్నల్​ అధ్యయనంలో వెల్లడి

watching reels at night side effects
watching reels at night side effects (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Feb 5, 2025, 5:18 PM IST

Watching Reels at Night Side Effects: ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారిపోయింది. ముఖ్యంగా ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది యువత ఇంటర్​నెట్​లోనే గడిపేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా కాలేజీలో చదువు, ఆఫీసు ఒత్తిళ్లు, ఇంట్లో పనులు, చికాకులను మర్చిపోవడానికి రాత్రిళ్లు సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూస్తూనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. అయితే, ఇది మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల చైనాలో దాదాపు 4వేల మందిపై చేసిన అధ్యయనాల్లో యువత, మధ్య వయసు వారు రాత్రి వేళల్లో రీల్స్ చూడడం వల్ల రక్త పోటు వచ్చిందని తేలింది. BMC Public Health జర్నల్​లో ప్రచురితమైన "Association between the screen time spent watching short videos at bedtime and essential hypertension in young and middle-aged people: a cross-sectional study" అనే అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చాలా మంది ఒంటరిగా ఉన్నా, కుంటుంబంతో ఉన్నా రీల్స్ చూస్తూనే ఉంటున్నారు. రాత్రిళ్లు సిస్టమ్​పై పని చేసేవారు, టీవీ చూసేవారికంటే మొబైల్​లో రీల్స్ చూసేవారు ఎక్కువగా ఉన్నారు. అయితే, రోజురోజూకీ ఇదొక వ్యసనంలా మారిపోతుందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయానికి ఫోన్ అందుబాటులో లేకపోయినా,రీల్స్ చూసేందుకు వీలు కాకపోయినా చిరాకు, అసహనం వచ్చేస్తున్నాయని వివరిస్తున్నారు.

ముఖ్యంగా రీల్స్ ప్రభావం జీవనశైలి మీద పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటి ఫలితంగా భావోద్వేగాలు అదుపులో లేకపోవడం, వాటిల్లో వచ్చే కంటెంట్​కు తగ్గట్టుగా జీవితం ఉండాలనే ఆశలు పెట్టుకోవడం లాంటివి చేస్తారని వివరిస్తున్నారు. ఈ సామాజిక మాధ్యమాల కంటెంట్ ప్రభావంతో కొన్ని సార్లు సంతోషంగా ఉంటే మరికొన్ని సార్లు ఒత్తిడి, ఆందోళన వంటివి వెంటాడుతుంటాయని వెల్లడిస్తున్నారు. 20 నుంచి 40 ఏళ్ల వయస్కులు డిప్రెషన్​కు గురయ్యేందుకు ప్రధాన కారణం రాత్రివేళల్లో ఫోన్ చూస్తూ ఆలస్యంగా నిద్రపోవడమే అని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇంకా ఫోన్ బ్లూ లైట్, స్లీప్ సైకిల్​లో తేడాను తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా మెలటోనిన్ హార్మోన్ విడుదలవుతుందని అంటున్నారు. ఫలితంగా నిద్రకు ఆటంకం కలిగి శరీరం అలసటకు గురవుతుందని వివరిస్తున్నారు. ఇలా కాకుండా రాత్రిళ్లు చక్కటి నిద్ర పట్టేందుకు మంచి పుస్తకం చదవడం, కుటుంబ సభ్యులతో గడపడం, సంగీతం వినడం వంటివి చేయొచ్చని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజూ స్నానం చేయడం మంచిది కాదా? ఎన్ని రోజులకోసారి చేయాలి? నిపుణులు ఏం అంటున్నారంటే?

పండ్లను ఎలా తింటున్నారు? కరెక్ట్ పద్ధతి ఎంటో తెలుసా? అలా తింటే షుగర్ వస్తుందట జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.