ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించాలనుకుంటున్నారా? - గుడ్​న్యూస్​ చెప్పిన దిల్​ రాజు - PRODUCER DILRAJU DREAMS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 8:50 PM IST

Dilraju Dreams : ప్రపంచ స్థాయిలో గౌరవాన్ని దక్కించుకున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త నటీనటులు, దర్శక నిర్మాతలను ప్రొత్సహించడంతో పాటు ఫెయిల్యూర్స్​ను తగ్గించేందుకు తన వంతు కార్యచరణ సిద్ధం చేసినట్లు ప్రముఖ నిర్మాత దిల్​రాజు తెలిపారు. నష్టనివారణ చర్యల్లో భాగంగా స్క్రిప్ట్ దశ నుంచే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పక్కాగా పట్టాలెక్కించేందుకు దిల్​రాజు డ్రీమ్స్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు దిల్​రాజు ప్రకటించారు. ఆ వ్యవస్థ ద్వారా ఏడాదికి ఐదు చిత్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపిన దిల్​రాజు, ఇందుకోసం ప్రత్యేక వెబ్​సైట్​ను డిసెంబర్ లేదా జనవరిలో భారీ స్థాయిలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఔత్సాహిక దర్శక నిర్మాతలు, నటీనటుల, కథారచయితలు దిల్​రాజు డ్రీమ్స్ ప్రతినిధులను సంప్రదించి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని సూచించారు. దిల్​రాజు డ్రీమ్స్ కోసం వారంలో ఒకరోజు తాను పూర్తి స్థాయి సమయాన్ని కేటాయిస్తానని, సినీపరిశ్రమ మేలు కోసం తనవంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.