ETV Bharat / state

బంగాళాఖాతంలో అల్పపీడనం - 2 రోజుల పాటు భారీ వర్షాలు! - HEAVY RAINS IN AP

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - ఏపీలోని కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు

Rain Forecast in AP
Heavy Rains In AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 14 hours ago

Heavy Rains In AP : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది మళ్లీ బలపడుతుంద? లేక బలహీనపడుతుందా అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకుని చిరు జల్లులు పడుతున్నాయి. దాంతో పాటు చల్లటి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఏపీలో భారీ వర్షాలు : మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం,శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

గంటకు 55 కి.మీ. వేగంతో గాలులు : బుధవారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. సముద్రంలో గరిష్ఠంగా గంటకు 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం సహా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు చేశారు.

తీరానికి సమీపంలోనే అల్పపీడనం - గురువారం వరకు వర్షసూచన

రెయిన్​ అలర్ట్ : అల్పపీడనం ఎఫెక్ట్ ​- నేటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.