ETV Bharat / sports

అశ్విన్ స్థానంలో 26 ఏళ్ల స్పిన్నర్​ - ఎవరీ తనుష్ కోటియన్? - WHO IS TANUSH KOTIAN

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ మధ్యలో రిటైర్మెంట్‌ ప్రకటించిన సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో తనుష్‌ కోటియన్‌ - ఇంతకీ అతడు ఎవరంటే?

IND VS AUS Who Is Tanush Kotian
IND VS AUS Who Is Tanush Kotian (source ANI)
author img

By ETV Bharat Sports Team

Published : 14 hours ago

IND VS AUS Who Is Tanush Kotian : బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ మధ్యలో రిటైర్మెంట్‌ ప్రకటించిన సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో భారత జట్టు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకున్న సంగతి తెలిసిందే. ముంబయి ఆఫ్‌స్పిన్నర్‌ తనుష్‌ కోటియన్‌కు సెలక్టర్లు జట్టులో స్థానం కల్పించారు. దేశవాళీ క్రికెట్​లో ముంబయి తరఫున ఆడే తనుష్ కోటియన్​ను ఆస్ట్రేలియాకు పంపిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న అతడు, మంగళవారం (డిసెంబర్ 24) బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్తున్నాడు.

తనుష్ కోటియన్ ఎవరంటే?

ఆస్ట్రేలియాతో జరగబోయే చివరి రెండు టెస్టుల కోసం తనుష్ కోటియన్​ను ఎంపిక చేశారు. వాస్తవానికి అశ్విన్ వెళ్లిపోవడంతో జట్టులో జడేజా, వాషింగ్టన్ సుందర్ మాత్రమే ఉన్నారు. దీంతో మూడో స్పిన్నర్​గా తనుష్​ను తీసుకున్నారు. ఇతడు మంచి ఆల్​రౌండరే. ఆస్ట్రేలియా ఎతో ఈ మధ్యే జరిగిన రెండు అనధికారిక టెస్టుల కోసం ఇండియా ఎ జట్టు సభ్యుడిగా అక్కడికి ఉన్నాడు. రెండో టెస్టులో ఒక వికెట్ తీయడంతో పాటు 44 పరుగులు చేశాడు. అతడు ఇప్పటి వరకూ 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్​లలో 1525 పరుగులు నమోదు చేశాడు. సగటు 41.21 కావడం విశేషం. ఇక 25.7 సగటుతో 101 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇంకా రెండు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2023-24లో రంజీ ట్రోఫీలో విజయం సాధించిన ముంబయి జట్టులో ఉన్న తనుష్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. ఆ సీజన్​లో అతడు 502 పరుగులు చేయడంతో పాటు 29 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇరానీ కప్ లోనూ రెస్టాఫ్ ఇండియాపై శతకం బాదాడు. దీంతో ముంబయి జట్టు 27 ఏళ్ల తర్వాత ఈ కప్ సాధించింది. ఇండియా ఎ తరఫున దులీప్ ట్రోఫీలో ఆడి 10 వికెట్లు తీశాడు.

కాగా, అశ్విన్‌ స్థానంలో ముందుగా అనుభవజ్ఞుడైన అక్షర్‌ పటేల్‌ను ఆస్ట్రేలియాకు పంపాలని సెలక్టర్లు ఆలోచన చేశారు. కానీ అతడు కుటుంబ కారణాలతో విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కోటియన్‌ను ఎంచుకున్నట్లు తెలిసింది.

క్షీణించిన వినోద్​ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి - ఇప్పుడెలా ఉందంటే?

మహిళల ఛాంపియన్‌షిప్‌ - భారత్‌ పరిస్థితేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.