Viveka murder case: సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి.. 5గంటల పాటు ప్రశ్నల వర్షం - అవినాష్ రెడ్డి పై జగన్ కామెంట్స్
🎬 Watch Now: Feature Video
YCP MP Avinash Reddy: వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. జూన్ 30వ తేదీ వరకు ప్రతి శనివారం సీబీఐ కార్యాలయానికి వెళ్లాలని హైకోర్టు అవినాష్ రెడ్డిని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో సీబీఐ కార్యాలయానికి వచ్చిన అవినాష్ రెడ్డి సాయంత్రం 5గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నారు. వివేకా హత్యకు సంబంధించి సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ మేరకు అవినాష్ రెడ్డి 4 శనివారాల పాటు సీబీఐ కార్యాలయానికి వచ్చారు. గత ఆదివారం ఉదయం సైతం అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చి అధికారులు అడిగిన పత్రాలను అందించి వెళ్లాడు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెలలో 4 శనివారాలు అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చారు. అధికారులు దర్యాప్తులో భాగంగా అవసరమైతే అవినాష్ రెడ్డిని మల్లీ పిలిచే అవకాశం ఉందని సీబీఐ అధికారులు వెల్లడించారు.