1200 చాక్‌పీస్‌లతో అయోధ్య రామమందిరం నమూనా- ప్రాణప్రతిష్ఠ రోజే ఆవిష్కరణ - అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ
🎬 Watch Now: Feature Video
Published : Jan 18, 2024, 10:25 AM IST
Youth Built Chalk Piece Ram Mandir : 1200 చాక్‌పీస్‌లతో అయోధ్య రామమందిరం నమూనాను రూపొందించాడు ఓ యువకుడు. అతడు తయారుచేసిన చాక్‌పీస్ రామమందిరం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయోధ్య రామలయం ప్రాణప్రతిష్ఠ జరగనున్న రోజే, తాను రూపొందించిన చాక్‌పీస్ రామమందిరాన్ని ఆవిష్కరిస్తానని చెబుతున్నాడు. అతడే కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా గెరుసొప్పకు చెందిన ప్రదీప్ నాయికా.
హొన్నావర మండలం గెరుసొప్ప గ్రామంలో నివాసం ఉండే చంద్రకళ, మంజునాథ దంపతుల కుమారుడు ప్రదీప్ నాయికా. ప్రదీప్‌కు చిన్నప్పటి నుంచి వివిధ కళలపై ఆసక్తి ఉండేది. అలా పెయింటింగ్, తబలా, సంగీతం, చాక్‌పీస్ ఆర్ట్ వంటి కళల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఈ క్రమంలో చాక్‌పీస్‌లతో అయోధ్య రామమందిరం నమూన తయారు చేయాలని అనుకున్నాడు. 1200 చాక్‌పీస్‌లను ఉపయోగించి రామమందిర నమూనాను రూపొందించాడు. దాన్ని తయారుచేయడం కోసం 25 రోజుల్లో 250 గంటల పాటు శ్రమించాడు. ఈ చాక్‌పీస్‌ల రామమందిరాన్ని అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు (జనవరి 22), గెరుసొప్పలోని శ్రీ గుత్తికన్యకా పరమేశ్వరి ఆలయంలో తన తల్లిదండ్రులు, తదితరుల సమక్షంలో ఆవిష్కరిస్తానని ప్రదీప్ తెలిపాడు.
ఇంతకుముందు, బుద్ధుడు, గాంధీ, ఈఫిల్ టవర్ వంటి రూపాలను చాక్పీస్లపై చెక్కి అబ్బురపరిచాడు ప్రదీప్.18 చాక్పీస్లపై జాతీయ గీతాన్ని చెక్కి ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.