ETV Bharat / opinion

పెళ్లి ఎంత సహజమో, విడాకులు కూడా అంతేనా! - DIVORCE RATE INCREASE IN INDIA

దేశంలో పెరిగిపోతున్న విడాకులు - చిన్న చిన్న కారణాలకే విడిపోతున్న దంపతులు - అనుమానాలు, అలవాట్లతో దంపతుల మధ్య దూరం - అవగాహనే దంపతుల మధ్య సఖ్యతకు కీలకం అంటున్న నిపుణులు

Divorce Rate Increase in India
Divorce Rate Increase in India (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2025, 5:16 PM IST

Divorce Rate Increase in India : సంసార నావను దరికి చేర్చాలన్నా కుటుంబమనే బండి సజావుగా ముందుకు నడవాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత ముఖ్యం. పిల్లల భవిష్యత్తుకు కూడా ఇది కీలకమే. అయితే ఇటీవల విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు ఈ విషయంలో కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు, చిన్న కుటుంబాలు పెరిగిపోవటం, సామాజిక మాధ్యమాలు వీటిలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు. ప్రేమ పెళ్లిళ్లు కూడా పెటాకులు అవుతుండటం భార్యభర్తల సంబంధానికి తీవ్ర విఘాతంగా మారింది.

రోజురోజుకీ పెరుగుతున్న విడాకులు : భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది. అలాంటి దేశంలోనే కొంతకాలంగా విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రస్తుతం విడాకుల ట్రెండ్ నడుస్తోంది. కొన్ని కారణాలు చాలా చిన్నగా, వింతగా అనిపించినా కోర్టు మెట్లు ఎక్కుతున్న వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. వీరిలో చదువుకున్న వారు కూడా ఎక్కువ ఉంటున్నారు.

ఆర్థిక స్వాతంత్య్రం, మారుతున్న సామాజిక పరిస్థితులు, తానే గొప్ప అనే ధోరణులు ఇలా విడిపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలకు కారణం అవుతున్నాయి. పెరిగి పెరిగి విభేదాలుగా మారి తర్వాతి కాలంలో గొడవలకు దారి తీస్తున్నాయి. సర్దుబాటు చేసుకోలేని క్రమంలో గొడవలు పెరిగి పోలీసు కేసులు, కోర్టులు చివరకు విడాకులతో పరిసమాప్తి అవుతోంది. భార్యభర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తుంటే కుటుంబ బాధ్యతలు పంపకం, ఇంటి పనులు, పిల్లల పెంపకం వంటి విషయాల్లో గొడవలు వస్తున్నాయి.

బాధ్యతల పంపకాల విషయంలో తేడాలు : గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు జరిగేవి. కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు వచ్చాయి. అప్పట్లో భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు వస్తే ఇంటిపెద్ద పరిష్కరించే వారు. ఇద్దరి తరపు పెద్దవారు కూర్చుని 4 గోడల మధ్యే వారి మధ్య అంతరాన్ని తొలగించేవారు. దంపతులు ఇద్దరూ ఉద్యోగస్థులైతే బాధ్యతల పంపకాల విషయంలో తేడాలు వస్తున్నాయి. మరికొందరు కంప్యూటర్లు, సెల్‌ఫోన్లతో పని చేస్తూ సంసార జీవితానికి దూరమవుతున్నారు.

భార్య, భర్తలకు కౌన్సిలింగ్ : వివాహ బంధంలో దంపతుల మధ్య పరస్పరం ప్రేమానురాగాలు ఉంటేనే ఆ కాపురం సజావుగా సాగుతుంది. అనుమానాలు, ఘర్షణలు, వాదులాటలు, కట్నం వేధింపుల వల్ల బంధం బీటలు వారుతుంది. ఈ క్రమంలోనే కొందరు మహిళలు గృహ హింస బారిన పడుతున్నారు. వేధింపులు తాళలేక బాధితులు పోలీసులకు లేదా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన సఖి-వన్‌స్టాఫ్‌ సెంటర్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ కేసుల్లో గృహ హింస నిరోధక చట్టం కింద ఫిర్యాదులు స్వీకరించి భర్త, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నారు.

గృహ హింస నిరోధక చట్టం కింద ఫిర్యాదు అందిన తర్వాత భార్య, భర్త ఇద్దరికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంటారు. రెండు సార్లు కౌన్సెలింగ్‌ చేసిన తర్వాత కొందరు రాజీ చేసుకుని కలిసి మెలిసి ఉంటారు. రాజీకి అంగీకరించకుంటే పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేయించి న్యాయ స్థానంలో ప్రవేశపెడుతున్నారు. తమ వద్దకు వచ్చిన కేసుల్లో భార్యాభర్తలు ఇద్దరితో మాట్లాడి కౌన్సిలింగ్‌ చేసి రాజీ కుదర్చడానికే ప్రయత్నిస్తారు. కొందరు అంగీకరిస్తున్నారు. అంగీకరించని వారిపై కేసులు నమోదు చేసి కోర్టులకు పంపిస్తున్నారు. అయితే రాజీతోనే కుటుంబాలు నిలబడి పిల్లలను చూసుకునే అవకాశం ఉంటుందని సఖి నిర్వాహకులు చెబుతున్నారు.

బంధానికి బీటలు : గణాంకాలు, కేసుల బట్టి చూస్తే నేటి సమాజంలో పెళ్లి ఎంత సహజమో, విడాకులు కూడా అంతే అనే పరిస్థితి కనిపిస్తోంది. విడాకులకు దారి తీసే పరిస్థితులు, కారణాలపై జరిపిన సర్వేలో చాలారకాల కారణాలు వెల్లడయ్యాయి. వాటిలో 7రకాల కారణాలు అందరిలో కామన్‌గా కనిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలతో మోసం, ప్రేమ లేకపోవడం, అత్యాశ, ఇష్టం లేని పెళ్లి, శారీరక సాన్నిహిత్యం లేకపోవడం, సాన్నిహిత్య లోపం. మానసికంగా ఒంటరిగా ఉన్నప్పుడు జంటగా ఒకే ఇంట్లో నివసించినా అందులో జీవం ఉండదు. ఫలితంగా కాలం గడిచే కొద్దీ ఆ బంధం బీటలు వారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు : ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? అసలు పెళ్లి చేసుకోవాలా, వద్దా? అనేవి వ్యక్తిగత అంశాలు. మన దేశంలో పెళ్లికి ఇప్పటికీ చాలా ప్రాధాన్యం ఉంది. సహ జీవనానికి చట్టాలు అనుమతిస్తున్నా అందులో విడాకులకు అవకాశాలు లేవు. దేశంలో అన్ని మతాల్లోనూ పెళ్లి ప్రాధాన్యత తగ్గలేదు. కాకపోతే వివాహాలు కాలానికి అనుగుణంగా మారుతున్నాయి. కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో విడాకులు పెరుగుతున్నాయి. ఓ జంట విడాకులు కోరటానికి చాలా కారణాలు ఉండొచ్చు.

హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం భార్య లేదా భర్త తమ వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు ఉంటుంది. ఈ చట్టంలోని సెక్షన్13లో ఏ కారణాలతో విడాకులు తీసుకోవచ్చో కూడా పేర్కొన్నారు. ఇతరులతో వివాహేతర సంబంధాలను కారణంగా చూపించడం, క్రూరత్వం, భార్యా, భర్తలు ఒకరిని ఒకరు పట్టించుకోకపోవడం, భార్య లేదా భర్త మతి స్థిమితం కోల్పోవడం, భార్య లేదా భర్త వేరే మతానికి మారడం, జంటలో ఒకరు మరొకరిని విడిచిపెట్టడం వంటి కారణాలతో విడాకులు పొందవచ్చు. భార్య లేదా భర్త ఏడేళ్ల పాటు కనిపించకుండా పోతే అతడు లేదా ఆమెను మరణించిన వారిగా పరిగణిస్తారు. అప్పుడు దీన్ని కారణంగా చూపించి కోర్టులో విడాకులకు అభ్యర్థన పెట్టుకోవచ్చు.

అబ్బాయి, అమ్మాయి మధ్య అవగాహన ముఖ్యం : విడాకుల శాతం తగ్గాలంటే వివాహ వ్యవస్థలోనూ మార్పులు రావాలి. కట్నాలు, లాంఛనా లు భారీగా తీసుకుంటే తర్వాత వచ్చే సమస్యలు కూడా అలాగే ఉంటున్నాయి. పెళ్లికి ముందే రెండు కుటుంబాల పెద్దలు కూర్చుని మాట్లాడుకోవాలి. కట్నకానుకలు, ఉద్యోగం జీతభత్యాలే కాక అబ్బాయి, అమ్మాయి మధ్య అవగాహన ముఖ్యం. అలాగే వారిద్దరి ఆరోగ్యాలు ముఖ్యం. ఇటీవల చాలామంది పెళ్లికి ముందే వైద్య పరిక్షలు చేయించుకుంటున్నారు. సంబంధిత ధృవపత్రాలు కూడా రెండు కుటుంబాల వారు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అలాగే కుటుంబ బాధ్యతల విషయంలో కూడా చూచాయగా మాట్లాడుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

న్యాయమూర్తి ఆగ్రహం : న్యాయవ్యవస్థ కూడా విడాకుల విషయంలో దృష్టి సారించింది. విడాకుల సమయంలో మనోవర్తి విషయంలో కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సంపన్నంగా జీవించటానికి, బ్యూటీ పార్లర్‌కు వెళ్లడానికి అయ్యే ఖర్చులను కూడా లక్షలకు లక్షలు లెక్కగట్టి మనోవర్తి అడగటాన్ని ఓ కేసులో న్యాయస్థానం తప్పుబట్టింది. ఇలాంటి డిమాండ్లు సహేతుకం కాదని ఆక్షేపించింది. అలాగే మరోచోట ఓ సంపన్నుడి భార్య విడాకుల కోసం కోర్టుకెక్కారు. 500కోట్ల రూపాయల భరణం ఇచ్చేందుకు భర్త ముందుకొచ్చాడు. అలా కాకుండా ఆస్తిలో సగం వాటా కావాలని మహిళ కోర్టును కోరటంతో న్యాయమూర్తి ఆగ్రహం వెలిబుచ్చారు. భర్త నుంచి విడిపోయిన మహిళ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, గౌరవంగా, మంచి జీవనాన్ని సాగించటానికి భరణం ఇస్తారని న్యాయమూర్తి కుండ బద్దలుకొట్టారు.

ఇలాంటి కేసులు చూశాక విడాకుల వెనుక ఉన్న ఆర్థిక కోణాల గురించిన చర్చా తీవ్రం జరుగుతోంది. ఏది ఏమైనా దంపతులు ప్రేమ, ఆప్యాయతలు, అవగాహనతో జీవనం సాగిస్తేనే విడాకులు తగ్గుతాయి. గొడవలకు దిగకుండా కలిసి మాట్లాడుకుంటే సంసార బంధం కలకాలం నిలిచి ఉంటుంది. పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుంటే కాపురం పచ్చగా సాగిపోతుంది.

73ఏళ్ల భార్య 69ఏళ్ల భర్త విడాకులు - రూ.3.7 కోట్లతో 43ఏళ్ల వివాహానికి కాస్ట్లీ ఎండ్​కార్డ్​!

'నన్ను పెళ్లి చేసుకున్నాడు - ఇప్పుడు ఆమెతో సహజీవనం చేస్తున్నాడు' - చట్టం ఎలాంటి సాయం చేస్తుంది??

ఇప్పటి దాకా విడాకులు తీసుకున్న ప్రముఖ సినీనటులు - సెలబ్రిటీలు వీరే! - మీకు తెలుసా? - Famous Celebrities Divorce

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.