ICC Test Player Of The Year 2024 : టీమ్ఇండియా యంగ్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి గాను 'ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపికయ్యాడు. జో రూట్ (ఇంగ్లాండ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక)తో పోటీపడి అతడు ఈ అవార్డును దక్కించుకున్నాడు. గతేడాది టెస్టుల్లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. 13 టెస్టుల్లో ఏకంగా 71 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే 2024లో సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో అతడిని ఐసీసీ మెన్ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది.
ఆరో ప్లేయర్‌గా రికార్డు
ఈ క్రమంలోనే 'ఐసీసీ టెస్టు క్రికెట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలుచుకున్న ఆరో భారతీయుడిగా బుమ్రా నిలిచాడు. బుమ్రా కంటే ముందు టీమ్ఇండియాకు రాహుల్ ద్రవిడ్ (2004), గౌతమ్ గంభీర్ (2009), వీరేంద్ర సెహ్వాగ్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2018) ఈ అవార్డు దక్కించుకున్నారు. అయితే భారత్ నుంచి ఈ అవార్డు దక్కించుకున్న తొలి పేసర్ బుమ్రానే కావడం విశేషం. కాగా, బుమ్రా 2024 ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్, టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్లలోను స్థానం దక్కించుకున్నాడు.
One name shines the brightest amongst a glittering list of nominees 💎
— ICC (@ICC) January 27, 2025
Head here to know the winner ➡️ https://t.co/GnpFoJDs0g pic.twitter.com/lgsn7mH8uf
ఆసీస్‌తో సమంగా
ఇప్పటివరకు ఆసీస్ ఆటగాళ్లు అత్యధికంగా ఆరుగురు 'ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలుచుకున్నారు. తాజాగా బుమ్రా కూడా ఈ లిస్ట్‌లో చేరడం వల్ల, ఈ రికార్డును టీమ్ ఇండియా ఆటగాళ్లు సమం చేసినట్లైంది. ఇక ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మాత్రమే రెండుసార్లు (2015, 2017) ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు.
వెనుదిరగని చూసుకోని బుమ్రా
వెన్ను గాయం కారణంగా కొంతకాలం టెస్టు క్రికెట్ దూరమైన బుమ్రా 2023 చివర్లో జట్టులో చేరాడు. ఆ తర్వాత బుమ్రా వెనుదిరిగి చూసుకోలేదు. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ సిరీస్‌ల్లో టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుల్లో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ రాణించాడు.
అలాగే గతేడాది చివర్లో జరిగిన బోర్డర్- గావస్కర్ సిరీస్‌ను టీమ్ఇండియా కోల్పోయినప్పటికీ, బుమ్రా మాత్రం అదరగొట్టాడు. 5 మ్యాచుల్లో కలిపి 32 వికెట్లు పడగొట్టాడు. కాగా, 2024లో తాను ఆడిన 13 టెస్టుల్లో 357 ఓవర్లు బౌలింగ్ చేశాడు బుమ్రా. అందులో 71 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ రేటు 2.96 కాగా, సగటు 14.92.
ICC టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్- టీమ్ఇండియా నుంచి ముగ్గురికి చోటు
మ్యూజిక్ కన్సర్ట్‌లో 'బుమ్రా' సాంగ్- లక్ష మందితో హోరెత్తిన ఈవెంట్