Women Strike to Continue Poker Clubs : పేకాట శిబిరాలు కొనసాగించాలని మహిళల నిరసన.. డిప్యూటీ కలెక్టర్​కు వినతి

🎬 Watch Now: Feature Video

thumbnail

Women strike to continue poker clubs: గ్రామాల్లో మద్యం దుకాణాలు, పేకాట శిబిరాలు ఉండకూడదని మహిళలు ధర్నాలు చేయడం, నిరసన తెలపడం తెలిసిందే. కానీ, అందుకు భిన్నంగా.. తమ గ్రామ సరిహద్దులో పేకాట శిబిరాలను మూసివేయొద్దంటూ ఆందోళనకు దిగారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో జరిగిన ఈ ఘటన నేపథ్యమిదీ.

కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన కేంద్రపాలిత ప్రాంతం (union territory) యానాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పర్యాటకునికీ తెలుసు. పుదుచ్చేరి ప్రభుత్వానికి ఉన్న కొన్ని వెసులుబాట్లను ఆసరాగా చేసుకుని గతేడాది రిక్రియేషన్ క్లబ్బు (Recreation clubs)ల పేరిట ఇక్కడ పేకాట శిబిరాలు (poker clubs) ఏర్పాటు చేశారు. కాగా, పలువురు ప్రజాప్రతినిధులు.. అధిక శాతం ప్రజలు వ్యతిరేకిస్తూ కోర్టులను ఆశ్రయించి వాటిని మూయించారు. దీంతో ఆదాయం కోల్పోయిన శిబిరాల నిర్వాహకులు.. కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్న అవకాశాలను కోర్టుకు వివరించి తిరిగి అనుమతులు తీసుకున్నారు. క్లబ్బుల నిర్వహణ యధావిధిగా కొనసాగేందుకు ప్రయత్నించి సఫలమయ్యారు. అయితే, క్లబ్బుల నిర్వహణపై మరోసారి వివాదం నెలకొన్న నేపథ్యంలో.. పేకాట క్లబ్బులు కొనసాగించాలంటూ యానాం (Yanam) డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళలు నిరసన తెలిపారు. తమ గ్రామ పరిసరాల్లో రిక్రియేషన్ క్లబ్బుల నిర్వహణతో వందలాది మంది ఉపాధి పొందుతున్నామని, యథావిధిగా కొనసాగించాలని డిప్యూటీ కలెక్టర్ మునిస్వామికి వినతిపత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.