వృద్ధ టీచర్​ని దారుణంగా కొట్టిన మహిళా కానిస్టేబుళ్లు - వృద్ధ టీచర్​ని రోడ్డుపై కొట్టిన కానిస్టేబుళ్లు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 22, 2023, 9:54 AM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

బిహార్​లోని కైమూర్​లో ఓ అమానవీయ ఘటన జరిగింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఒక వృద్ధ టీచర్​ని విచక్షణారహితంగా కొట్టారు. వృద్ధ టీచర్ నావల్ కిషోర్ పాండే డీపీఎస్ పాఠశాల పర్మల్‌పూర్‌లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధిస్తున్నాడు. 3గంటల సమయంలో పాఠశాల నుంచి సైకిల్​పై జయప్రకాష్ చౌక్ నుంచి ఇంటికి వస్తున్నాడు. అయితే మార్గ మధ్యంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్​ను పట్టించుకోకుండా రోడ్డు దాటుతున్నాడు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు టీచర్​ను ఆపే ప్రయత్నం చేశారు. అతడు పట్టించుకోకుండా రోడ్డు దాటుతున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన కానిస్టేబుళ్లు వృద్ధుడిని రోడ్డు మీద ఆపి కొట్టడం ప్రారంభించారు. దీనిని గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల వైరల్​గా మారింది. ఈ వీడియోను చూసిన పోలీసు అధికారులు కానిస్టేబుళ్లపై తదుపరి విచారణకు ఆదేశించారు. వారిని 3 నెలల పాటు విధుల నుంచి తప్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.