కారు బానెట్​పై యువతిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్​.. కేకలు వేసినా ఆపకుండా.. - రాజస్థాన్​లో యువతిని ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 17, 2023, 9:43 AM IST

Updated : Aug 17, 2023, 9:59 AM IST

Woman Dragged By Car In Rajasthan : రాజస్థాన్​లోని హనుమాన్​గఢ్ జిల్లాలో కారు బానెట్​పై యువతిని ఈడ్చుకెళ్లాడు ఓ వ్యక్తి​. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. జంక్షన్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ కారు రాంగ్​ సైడ్​లో డివైడర్​ దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఓ యువతి ఆ కారును అడ్డగించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇదే సమయంలో కారు యువతి పైకి వెళ్లింది. యువతి కేకలు వేస్తూ బానెట్​పై వేలాడుతున్నా.. కారును పోనిచ్చాడు డ్రైవర్​. దీంతో యువతిని రక్షించడానికి స్థానికులు కారు వెంట పరుగులు తీశారు. అయినా దుండగుడు కారు అపలేదు. ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ కాగా...  పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కారును గుర్తించామని జంక్షన్ స్టేషన్ ఇంఛార్జ్​ విష్ణు ఖత్రి తెలిపారు. అయితే ఈ కేసులో దర్యాప్తు చేపట్టినప్పటికీ బాధితురాలి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.

Last Updated : Aug 17, 2023, 9:59 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.