Wild Elephant Damaging Tourist Car Viral Video : కోపంతో ఊగిపోయిన ఏనుగు.. రహదారిపై బీభత్సం.. టూరిస్ట్ కారు ధ్వంసం​ - రోడ్డుపై కారును డేమేజ్​ చేసిన అడవి ఏనుగు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 10:46 AM IST

Wild Elephant Damaging Tourist Car Viral Video : తమిళనాడు.. నీలగిరి జిల్లా కిల్తట్టపల్లం ప్రాంతంలో ఓ అడవి ఏనుగు బీభత్సం సృష్టించింది. కొత్తగిరి-మెట్టుపాళయం రహదారిపై ఓ టూరిస్ట్​ కారును అడ్డగించిన గజరాజు.. ధ్వంసం చేసింది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. 

ఇదీ జరిగింది..  
కోపంతో ఊగిపోయిన ఓ ఏనుగు ఆడవి నుంచి కొత్తగిరి-మెట్టుపాళయం రహదారిపైకి వచ్చింది. కోటగిరి నుంచి మెట్టుపాళయంకు వెళ్తున్న ఓ టూరిస్ట్​ కారును రహదారిపై చూసి చిర్రెత్తిపోయింది. అనంతరం ఆ కారును వెంబడించింది. దీంతో భయపడిన ప్రయాణికులు కారు నుంచి దిగి పారిపోయారు. అనంతరం కారు వద్దకు వచ్చిన ఏనుగు.. దాన్ని ధ్వంసం చేసింది. ఈ ఘటనను ఆ దారిలో వెళ్తున్న వాహనదారులు తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. కాగా, ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.