ETV Bharat / sports

ఆల్​రౌండ్​గా తెలుగమ్మాయి సత్తా - u19 మహిళల వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం - ICC U19 WOMENS T20 WORLD CUP

u19 మహిళల వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం - 58 పరుగులకే కుప్పకూలిన స్కాట్లాండ్‌ - సెంచరీతో అదరగొట్టిన తెలుగమ్మాయి!

Trisha Gongadi ICC U19 Womens T20 World Cup
Trisha Gongadi (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 28, 2025, 2:37 PM IST

Gongadi Trisha ICC U19 Womens T20 World Cup : అండర్-19 మహిళల వరల్డ్‌ కప్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా ఘన విజయాన్ని సాధించింది. సూపర్ సిక్స్‌లో భాగంగా తాజాగా జరిగిన రెండో మ్యాచ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష దెబ్బకు 58 పరుగులకే స్కాట్లాండ్‌ చేతులెత్తేసింది. దీంతో 150 పరుగుల తేడాతో ఆ జట్టు ఘోర పరాజాయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలిపోయింది. ఓపెనర్లు వాల్‌సింగమ్‌ (12), పిప్పా (12), పిప్పా స్ప్రౌల్ (11) మాత్రమే రెండంకెల స్కోరు నమోదు చేశారు. భారత్‌ బౌలర్లలో శుక్ల 4 వికెట్లు పడగొట్టగా, వైష్ణవి శర్మ, త్రిష చెరో 3 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.

తెలుగమ్మాయి సెంచరీ!
టోర్నీలోని ప్రతి మ్యాచ్‌లోనూ తనదైన శైలిలో ఆడి అభిమానులను అలరిస్తోన్న తెలుగమ్మాయి గొంగడి త్రిష ఈ సారి కూడా అద్భుతంగా ఆడింది. ఈ క్రమంలో కేవలం 53 బంతుల్లోనే శతకం (110*) బాది అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కింది. దీంతో పాటు ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్​తో 'ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు'ను అందుకుంది.

వాళ్లూ అదుర్స్!
ఓపెనర్లు త్రిష - కమలిని కలిసి తొలి వికెట్‌ సమయానికి 147 పరుగులను జోడించారు. హాఫ్ సెంచరీ తర్వాత కమలిని ఔటైనప్పటికీ భారత ఇన్నింగ్స్‌ మాత్రం ఆగలేదు. సానికాతో కలిసి చివరి వరకూ క్రీజ్‌లో ఉన్న త్రిష రెండో వికెట్‌ సమయానికి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించింది. అలా త్రిష తన సెంచరీతో స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించగా, ఓపెనర్ కమలిని(51) కూడా హాఫ్ సెంచరీ చేసి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించింది. వీరిద్దరితో పాటు సానికా చల్కే (29*) కూడా మంచి ఇన్నింగ్స్‌ ఆడింది.

ఈ క్రమంలో ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్న భారత్‌, తాజాగా జరిగిన సూపర్ సిక్స్‌లోనూ తన చివరి మ్యాచ్‌లోనూ భారీ స్కోరు నమోదు చేసింది. ఇది కూడా అండర్ 19 టీ20ల్లో ఓ రేర్​ రికార్డు కావడం విశేషం.

భారత మహిళల U19 స్క్వాడ్‌ : నికి ప్రసాద్ (కెప్టెన్), గొంగడి త్రిష, సానికా చల్కే, ఈశ్వరి అవ్సరే, మిథిలా వినోద్, భావిక అహిరే, ఆయుషి శుక్లా, జి కమలిని (వికెట్ కీపర్), షబ్నం ఎండి షకీల్, వైష్ణవి శర్మ, సోనమ్ యాదవ్.

స్కాట్లాండ్ ఉమెన్ U19 స్క్వాడ్‌ : నియామ్ ముయిర్ (కెప్టెన్​), పిప్పా కెల్లీ, అమేలీ బాల్డీ, ఎమ్మా వాల్సింగ్‌హామ్, పిప్పా స్ప్రౌల్ (వికెట్ కీపర్), నయ్మా షేక్, షార్లెట్ నెవార్డ్, గాబ్రియెల్లా ఫోంటెన్లా, మైసీ మసీరా, మోలీ పార్కర్, క్రిస్టీ మెక్‌కాల్.

మహిళల క్రికెట్​లో ప్రపంచ రికార్డు - 390 ర‌న్స్ ఊదేసిన టీమ్

'టీమ్ఇండియాలో అదే లోటు- దానిపై ఫోకస్ చెయ్యాల్సిందే' - Mithali Raj

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.