7అడుగుల ఎత్తు, 5టన్నుల ఇసుక- విరాట్ కోహ్లీ సైకత శిల్పం అదుర్స్! - విరాట్ కోహ్లీ 35 బర్త్‌డే
🎬 Watch Now: Feature Video
Published : Nov 5, 2023, 10:01 AM IST
Virat Kohli Sand Art : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్, రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ నేడు (నవంబర్ 5)న 35వ ఏట అడుగుపెట్టనున్నాడు. ఈ క్రమంలో ప్రపంచమంతట అతని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. అయితే ఓ అభిమాని మాత్రం విన్నూత్న రీతిలో విషెస్ తెలిపారు. ఒడిశాకు చెందిన సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్.. పూరీ తీరంలో విరాట్ రూపంలో ఓ సైకత శిల్పాన్ని తయారు చేశారు. సుమారు 5 టన్నుల ఇసుకతో ఏడు అడుగుల కోహ్లీ చిత్రాన్ని ఆయన రూపొందిచారు. భారత జెర్సీలో ఉన్న విరాట్.. వెనక 35 బ్యాట్లతో ఆ చిత్రాన్ని చేశారు. ఈ శిల్పం తయారీలో సుదర్శన్‌కు తన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ సహాయం చేశారట. ప్రస్తుతం ఆ సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
గతంలోనూ సుదర్శన్.. విరాట్ కోసం ఓ సైకత శిల్పాన్ని తయారు చేశారు. 2017లో విరాట్- అనుష్క వివాహ బంధంతో ఒక్కటైన సందర్భంగా.. క్రికెట్, సినిమా కలయికతో ఉన్న ఓ విరుష్క జోడి చక్కటి శిల్పాన్ని ఆయన రూపొందించారు. అందులో బంతి, బ్యాట్‌ని చుట్టుకున్న సినిమా రీల్‌తో.. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వెడ్డింగ్ ఫొటోను సైకత శిల్పంగా మలిచారు.