ETV Bharat / entertainment

'డాకు మహారాజ్​' ఓటీటీ రిలీజ్ - స్ట్రీమింగ్​ ఎప్పుడంటే? - DAAKU MAHARAJ OTT RELEASE

ఓటీటీలోకి సందడి చేయనున్న 'డాకు మహారాజ్​' - స్ట్రీమింగ్​ ఎప్పుడంటే?

Daaku Maharaj OTT Release
Daaku Maharaj OTT Release (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2025, 2:08 PM IST

Daaku Maharaj OTT Release : నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్​లో తెరకెక్కిన వహించిన చిత్రం 'డాకు మహారాజ్‌'. శ్రద్ధా శ్రీనాథ్‌, బాబీ దేవోల్‌, ప్రజ్ఞా జైస్వాల్‌, ఊర్వశీ రౌతేలా లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీ వెర్షన్ కూడా మంచి టాక్ అందుకుంది.

అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ తెగ​ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్‌ఫ్లిక్స్‌' అభిమానుల కోసం ఓ గుడ్ న్యూస్​ తెలిపింది. 'డాకు మహారాజ్‌' స్ట్రీమింగ్‌ డేట్‌ను అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్​కు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.

స్టోరీ ఏంటంటే?
చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లిలో స్టార్ట్ అవుతుంది ఈ క‌థ‌. అక్క‌డ కాఫీ ఎస్టేట్‌కి అధిప‌తి అయిన కృష్ణ‌మూర్తి (స‌చిన్ ఖేడ్క‌ర్‌) విద్యాసంస్థ‌ల్ని న‌డుపుతుంటాడు. అతడికి త‌న మ‌న‌వ‌రాలు వైష్ణ‌వి అంటే ఎంతో ప్రాణం. చిన్న‌ప్పుడే త‌ల్లి చ‌నిపోవ‌డం వల్ల ఆ పాపకి అన్నీ తామై కుటుంబ‌మంతా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. అటువంటి పాప ప్రాణాల‌కి లోక‌ల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు (ర‌వికిష‌న్‌) నుంచి ముప్పు ఏర్ప‌డుతుంది. దాంతో ఆ ఇంట్లోనే ప‌నిచేస్తున్న త‌న సైన్యం నుంచి భోపాల్‌లో ఉన్న మ‌హారాజ్ (బాల‌కృష్ణ‌)కి వ‌ర్త‌మానం అందుతుంది.

అయితే వైష్ణ‌విని కంటికి రెప్ప‌లా కాపాడ‌తాన‌ని మాట ఇచ్చిన మ‌హారాజ్ త‌న పేరుని నానాజీగా మార్చుకుని అక్కడికి వస్తాడు. ఇంత‌కీ ఈ మ‌హారాజ్ ఎవ‌రు? అతడు భోపాల్‌లో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది? తనకు వైష్ణవికి ఉన్న రిలేషన్ ఏంటి?. ఈ క‌థ‌తో నందిని (శ్ర‌ద్ధా శ్రీనాథ్), కావేరి (ప్ర‌జ్ఞా జైస్వాల్‌), బ‌ల్వంత్ ఠాకూర్ (బాబీ దేవోల్‌)ల‌కు ఉన్న సంబంధం ఏమిట‌నే విష‌యాలు తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే!

ఊర్వ‌శి రౌతేలా స్పెషల్ సాంగ్​లో మెరిసి ఆకట్టుకుంది. ఆ పాట‌తో ఆమె సినిమాకి కొత్త అందాన్ని తీసుకొచ్చింది. బ‌ల్వంత్‌సింగ్ ఠాకూర్ పాత్ర‌లో బాబీ దేవోల్ ద్వితీయార్ధంలో కనిపించారు. అయితే ఆయ‌న పాత్రలో పెద్ద‌గా బ‌లం లేదు. కానీ ఉన్నంత‌లోనే క్లాస్‌గా చూపించారు. ఇక ఫస్ట్​ హాఫ్​లో ర‌వికిష‌న్ విల‌నిజం ఆక‌ట్టుకుంటుంది. ఆయ‌న త‌మ్ముడిగా క‌నిపించిన డైరెక్టర్ సందీప్‌రాజ్ కూడా కొన్ని సీన్స్​తో ఆకట్టుకున్నారు. దివి, చాందిని చౌద‌రి, మ‌క‌రంద్ దేశ్‌పాండే, స‌చిన్‌ ఖేడ్క‌ర్‌, వైష్ణ‌విగా క‌నిపించిన చిన్నారితో పాటు, పలు పాత్ర‌లు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షిస్తాయి.

'ఏజ్​ చూసి బాలయ్య ఛాన్స్​లు ఇవ్వరు - ఆయనతో నన్ను స్క్రీన్​పై చూసుకుని షాకయ్యాను'

'డాకు మహారాజ్' హిందీ వెర్షన్- అక్కడ కూడా 'జై బాలయ్య'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.