Vintage Car Exhibition : 'ఓల్డ్ ఈజ్ గోల్డ్'.. వింటేజ్​ కార్ల షో అదుర్స్.. 1926 నాటి వాహనాలు సైతం..

🎬 Watch Now: Feature Video

thumbnail

Vintage Car Exhibition 2023 In Chennai : హిస్టారికల్‌ కార్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా- హెచ్​సీఏఐ ఆధ్వర్యంలో చెన్నైలో ఏర్పాటు చేసిన వింటేజ్ కార్ కలెక్టర్స్ ఎక్స్‌పో ఆకట్టుకుంటోంది. 'హెరిటేజ్​​ రోలర్స్​ 2023' పేరుతో ప్రముఖ సంస్థలకు చెందిన అలనాటి మేటి కార్లను.. ఈ ప్రదర్శనలో ఉంచారు. రోల్స్‌రాయిస్, వోల్వో, షెవర్లే, బెంట్లీ సంస్థలకు.. చెందిన అరుదైన పాత కార్లను వాటి యజమానులు.. ప్రదర్శనకు తెచ్చారు. దేశం నలుమూలల నుంచి వింటేజ్ కార్లు వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్​ షోలో 68 కార్లు, 20 బైక్‌లు ప్రదర్శనకు ఉంచామని.. అందులో 1926 నాటి కార్లు ఉన్నాయని హెచ్​సీఏఐ కార్యదర్శి వీఎస్ కైలాస్​ తెలిపారు.

ఇలాంటి కార్లను మెయింటేన్​ చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ.. యజమానులు జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఈ ప్రదర్శనను చూసేందుకు చిన్నారుల నుంచి అన్ని వయసుల వారు.. ఆసక్తి కనబరిచారు. ఆధునిక కార్లకు వాటికి మధ్య తేడాను చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పటి కార్ల కంటే పాత కార్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని సందర్శకులు చెబుతున్నారు. సోమవారం చెన్నై నుంచి పుదుచ్చేరికి వింటేజ్ కార్లతో ర్యాలీ నిర్వహించనున్నారు. తర్వాత పుదుచ్చేరిలో వీటిని ప్రదర్శనకు ఉంచనున్నారు.

Last Updated : Aug 28, 2023, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.