Ajith Car Race : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కొత్త ఏడాదిలో ప్రత్యేకమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. 'అజిత్ కుమార్ రేసింగ్' పేరుతో ఆయన ఇటీవల ఒక రేసింగ్ టీమ్‌ను ప్రకటించారు. ఇక అదే టీమ్‌తో తాజాగా దుబాయ్ వేదికగా జరుగుతోన్న '24హెచ్ దుబాయ్ కారు రేసింగ్'లో పాల్గొని విజయం అందుకున్నారు. హోరా హోరీగా జరిగిన ఈ పోటీల్లో ఆయన టీమ్ మూడో స్థానంలో నిలిచింది.
ఇక ఇటీవల యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రేస్‌లో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన టీమ్ 'స్పిరిట్ ఆఫ్ రేస్' అనే అవార్డు అజిత్‌కు బహుకరించింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక అజిత్‌కు పలువురు నటీనటులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా, టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య కూడా అజిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ విజయంతో అందర్నీ గర్వపడేలా చేశారు. మీ జర్నీ, మీ విజయం సూపర్' అంటూ ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేశారు. అయితే నాగచైతన్యకు కూడా బైక్, కార్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజ్‌లో సూపర్ స్పోర్ట్స్ కార్లు ఉంటాయి. ఆయన కూడా అప్పుడప్పుడు రేసింగ్‌లో పాల్గొంటారు.
Ajith sir!! What a journey what a win ! ... A big cheers and congratulations for making us proud. #AjithKumarRacing #24HDubai2025 pic.twitter.com/UQqh4uGzVj
— chaitanya akkineni (@chay_akkineni) January 12, 2025
13ఏళ్ల తర్వాత
బైక్, కార్ రేసింగ్ అంటే ఎంతగానో ఇష్టపడే అజిత్, దాదాపు 13ఏళ్ల తర్వాత మోటార్ రేసింగ్‌లో పాల్గొన్నారు. ఈ రేస్ కోసం ఎన్నో రోజుల నుంచి ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల ట్రాక్‌పై ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. గోడను బలంగా ఢీ కొనడం వల్ల కారు ముందు భాగం డ్యామేజ్ అయ్యింది. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
అజిత్ సినిమాల విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం 'విదా ముయార్చి'లో నటిస్తున్నారు. ఈ సినిమా మాగిజ్ తిరుమేని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడింది.
హీరో అజిత్ షాకింగ్ డెసిషన్ - ఆ పని పూర్తయ్యేంతవరకూ నో మూవీస్!
సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న అజిత్ మూవీ - నిరాశలో ఫ్యాన్స్!