Mercedes-Benz G580 EQ: ఇండియన్ మార్కెట్లోకి అదిరే ఫీచర్లతో కొత్త లగ్జరీ ఈవీ కారు ఎంట్రీ ఇచ్చింది. మెర్సిడెస్ బెంజ్ తన కొత్త ఎలక్ట్రిక్ G-క్లారును దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ దీన్ని EQ టెక్నాలజీతో G580 పేరుతో లాంఛ్ చేసింది. ఇది ప్రస్తుతం ఇండియాలోని ఆఫ్-రోడర్ వాహనాల జాబితాలో చేరింది. ఈ నయా కారులోని నాలుగు చక్రాలలో ప్రతి దానిలో ఒక విద్యుత్ మోటారు ఉంటుంది. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు మీకోసం.
ఈ కారులో ముఖ్యమైన ఫీచర్లు: ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ G580 EQ కారులో 116 kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 470 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. దీని బ్యాటరీ 587bhp పవర్, 1165 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాక ఈ కారులో ఇండిపెండెంట్ ఫ్రంట్ సస్పెన్షన్ సిస్టమ్ కూడా ఉంది.
ఇందులో లో-రేంజ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు 850 మి.మీ వరకు నీటితో నిండిన ప్రాంతాల గుండా ఈజీగా ప్రయాణించగలదు. ఇది సాధారణ G-క్లాస్ కంటే ఎక్కువ. దీనికి జి-టర్న్ సౌకర్యం కూడా ఉంది. అంతేకాక ఇందులో మరిన్ని ఆఫ్-రోడ్ ఫంక్షన్లు ఉన్నాయి.
డిజైన్: ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు బోనెట్‌కు ఏరోడైనమిక్ డిజైన్ అందించారు. ఇందులో స్పేర్ వీల్ కవర్ కూడా ఉంది. ఇది ఛార్జింగ్ కేబుల్ హోల్డర్‌గా ఉపయోగపడుతుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లతో పోలిస్తే దీని ఇంటీరియర్‌లో చాలానే మార్పులు ఉన్నాయి.
ఆఫ్-రోడర్ ఎలక్ట్రిక్: కంపెనీ ఈ మెర్సిడెస్ బెంజ్ G580 EQ ధరను రూ. 3 కోట్లుగా నిర్ణయించింది. ఇది G63 AMG కంటే సరసమైన ధరకు లభిస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఈ కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమవ్వగా గతేడాది చివరి నాటికి ఇది చాలా బుకింగ్‌లను సొంతం చేసుకుంది. దీనిలో మరో విశేషం ఏంటంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక ఆఫ్-రోడర్ ఎలక్ట్రిక్ కారు ఇదే.
వావ్ స్పోర్టివ్ డిజైన్‌లో కొత్త పల్సర్ భలే ఉందిగా!- ఫీచర్స్, పెర్ఫార్మెన్స్లో కూడా సూపరంతే!
చౌకైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా?- రూ.200లోపు ధరలో బెస్ట్ ఇవే!
స్టన్నింగ్ లుక్‌లో హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ వచ్చేసిందోచ్!- ధర ఎంతంటే?