కూలిన వేదిక.. కింద పడిపోయిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు - stage collapsed chhattisgarh congress torch rally
🎬 Watch Now: Feature Video

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ్ సభ్వత్వం రద్దు చేయడంపై.. ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన నిరసనలో ప్రమాదం జరిగింది. అనర్హత వేటుకు వ్యతిరేకంగా బిలాస్‌పుర్‌లో కాంగ్రెస్ చేపట్టిన టార్చ్ ర్యాలీలో వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ మార్కంతో పాటు రాష్ట్ర ఇంఛార్జ్ చందన్ యాదవ్, ఎమ్మెల్యే శైలేశ్ పాండే, జిల్లా అధ్యక్షుడు కేసార్వాణి కింద పడిపోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. అయితే, ఈ ప్రమాదంలో పలువురు నేతలు గాయపడినట్లు సమాచారం.
బిలాస్‌పుర్‌లో 'సేవ్ డెమొక్రసీ టార్చ్ ర్యాలీ' పేరుతో కాంగ్రెస్ పార్టీ ఓ కార్యక్రమం నిర్వహించింది. అందులో భాగంగా.. గాంధీ చౌరస్తా నుంచి దేవకి నందన్ చౌరస్తా వరకు చార్చ్ ర్యాలీ చేపట్టింది. అనంతరం దేవకీ నందక్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక పైకి నేతలు ఎక్కారు. వారితో పాటు సామర్థ్యానికి మంచి పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ మార్కం ప్రసంగిస్తుండగా స్టేజ్ ఒక్కసారిగా కూలిపోయింది.