Shirdi Saibaba Sansthan Former President Anita Jagtap Hunger Strike: ఆలయ నిధులు ఇతర ప్రాంతాలకు తరలించొద్దని.. షిరిడీలో ఆందోళనలు - shirdi temple news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 6:16 PM IST

Shirdi Saibaba Sansthan Former President Anita Jagtap : దేశ వ్యాప్తంగా సాయిబాబా ఆలయాలను నిర్మించాలని షిరిడీ సాయిబాబా సంస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదన నేపథ్యంలో షిరిడీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశ వ్యాప్తంగా సాయిబాబా ఆలయాలను నిర్మించాలని షిరిడీ సాయిబాబా సంస్థాన్ ప్రతిపాదించింది. దీంతో సాయి సంస్థాన్, షిరిడీ గ్రామస్థుల మధ్య వివాదం తలెత్తింది. ఈ నిర్ణయాన్ని షిరిడీ గ్రామాలు వ్యతిరేకిస్తున్నాయని,.. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ షిరిడీ మాజీ మేయర్, షిరిడీ సాయిబాబా సంస్థాన్ మాజీ అధ్యక్షురాలు అనితా జగ్తాప్, అలాగే ఆమె భర్త మాజీ ఉపాధ్యక్షుడు విజయ్ జగ్తాప్ సాయి బాబా మందిరం ప్రవేశ ద్వారం ముందు బైఠాయించి.. ఆందోళన వ్యక్తం చేశారు. 

సాయిబాబా సంస్థాన్ నిర్ణయాన్ని ఉపసంహరించువాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. వచ్చిన నిధులు ఆలయానికి, షిరిడీలో అభివృద్ధి పనులు చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల స్థలం అందజేసిందని గుర్తు చేశారు. ఆలయానికి వచ్చే నిధులతో షిరిడీలో ఆసుపత్రి, అన్నదానం తదితర కార్యక్రమాలను అమలు చేయలని వారు సూచించారు. జగ్తాప్ దంపతులు ప్రారంభించిన నిరాహార దీక్షకు షిరిడీ గ్రామస్థులు, అన్ని పార్టీల నేతలు మద్దతు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.