ETV Bharat / entertainment

జపాన్​లో 'దేవర' మేనియా- షురూ అయ్యేది ఎప్పుడంటే? - DEVARA JAPAN RELEASE

దేవర జపాన్ వెర్షన్ రెడీ- రిలీజ్ అయ్యేది అప్పుడే!

Devara Japan Release
Devara Japan Release (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 13 hours ago

Devara Japan Release : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజై భారీ విజయం దక్కించుకుంది. పాన్ఇండియా లెవెల్​లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా జపాన్​ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

జపాన్​లో దేవర రిలీజ్!
'దేవర' జ‌పాన్ వెర్షన్ సినిమా 2025 మార్చి 28న రిలీజ్ కానుంది. 'ఆర్ఆర్ఆర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మార్చిలో విడుదల కానుంది. సముద్రంలో తిమింగలంతో పోరాటం చేసిన భారతీయ హీరో సినిమా రాబోతోంది' అని జపాన్​ పోస్టర్ రిలీజ్​ అయ్యింది. ఇక​ జనవరి 03 నుంచి టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ కానున్నట్లు పేర్కొన్నారు. ప్రభాస్ 'క‌ల్కి 2898 ఏడీ' చిత్రాన్ని జ‌పాన్​లో రిలీజ్ చేయనున్న ట్విన్ సంస్థనే 'దేవర' సినిమాను విడుదల కూడా చూసుకుంటుంది.

జపాన్​లో తారక్ క్రేజ్
కాగా, జ‌పాన్​లో ఎన్టీఆర్​కు ఫుల్ క్రేజ్ ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్ నటనతో ఆ క్రేజ్ కాస్త మరింత పెరిగిపోయింది. దీంతో తారక్ అక్క‌డ భారీగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీగా కలెక్షన్లు కొల్లగొట్టిన దేవర జపాన్​లోనూ మంచి వసూళ్లు సాధిస్తుందని తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తప్పకుండా జపాన్ ప్రజలకు దేవర నచ్చుతుందని అంటున్నారు.

జపాన్​కు తారక్
అయితే ఆర్ఆర్ఆర్ జపాన్​లో రిలీజ్ సమయంలో తారక్ అక్కడ ప్రమోషన్స్​లో పాల్గొన్నారు. ఇప్పుడు తారక్​కు జపాన్​లోనూ మంచి మార్కెట్ ఉంది. మరి దేవర రిలీజ్​కు ఎన్టీఆర్ జపాన్ వెళ్లి ప్రమోషన్స్​లో పాల్గొంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

'దేవర'లో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించారు. తంగం అనే పాత్రలో ఆమె చాలా నేచురల్​గా యాక్ట్ చేశారు. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్​లో కనిపించి అభిమానులను అలరించారు. సీనియర్ నటుడు శ్రీకాంత్, మరాఠి స్టార్ శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా, యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఇది సంయుక్తంగా రూపొందింది.

ఆ ఏరియాల్లో రోజుకు రూ.కోటి వసూలు! - సీడెడ్​లో 'దేవర' అరుదైన రికార్డు!

'దేవర' సక్సెస్​ మీట్​ - సెలబ్రేషన్స్​ కోసం తారక్ కూడా వెయిటింగ్ అంట! - Devara Success Meet

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.