Intermediate Preparation Tips 2025 : ఎగ్జామ్స్ అంటే సిలబస్-కాలాన్ని సంధానం చేస్తూ సమర్థంగా సన్నద్ధమవడం ఒక కళ అని నిపుణులు అంటున్నారు. మరికొద్ది రోజుల్లో పది, ఇంటర్ బోర్డు పరీక్షలు ప్రారంభం అవుతాయి. విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించేందుకు ఏం చేయాలో నిపుణులు పలు సూచనలు చేశారు.
ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం : గతంలో చదివిన అంశాలను మరోసారి చదవడం, చదివేటప్పుడు ముఖ్యమైన టాపిక్స్ అండర్ లైన్ చేయడం, వాటిని తక్కువ పదాల్లో పేపర్‌పై రాసుకోవడం చాలా ముఖ్యం. పేపర్‌పై రాసుకున్నవి గుర్తు ఉండేలా ఇతర విద్యార్థులతో చర్చించాలి. ప్రశ్నలు వేసుకోవడం, మనకు మనమే జవాబులు రాబట్టడం చేయాలి. ఇలా చేయడం వల్ల చదివిన వాటిని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది.
ప్రత్యేక శ్రద్ధ : ఎగ్జామ్స్ వ్యవధి తక్కువ ఉన్న టైంలో ఎక్కువ మార్కులు సాధించేందుకు వీలు ఉన్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పరిమిత టైంలో ఎక్కువ అంశాలను కవర్ చేసే ప్రణాళిక వేసుకోవాలి.
సరైన వాతావరణం : వార్షిక పరీక్షలను సులభంగా రాయగలిగే ఆత్మ విశ్వాసాన్ని కాలేజీల్లో నిర్వహించే టెస్ట్‌ల ద్వారా పెంపొందించుకోవాలి. పూర్వ, మాదిరి ప్రశ్న పత్రాలకు స్వయంగా జవాబులు రాసి పరీక్షించుకోవాలి.
ఇదీ తల్లిదండ్రుల బాధ్యత : తల్లిదండ్రులు ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు సూచనలు ఇవ్వడమే కాకుండా, వారి అవసరాల్ని గుర్తించి కావాల్సినవి ఏర్పాటు చేయాలి. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చూడాలి. మానసిక ధైర్యాన్ని ఇచ్చేలా వారితో మాట్లాడాలి. ఎగ్జామ్స్ సమయంలో తోడుగా ఉండాలి. ఇబ్బందులు ఉంటే అడిగి తెలుసుకోని పరిష్కరించాలి. అవసరం అయితే ఉపాధ్యాయుల సాయం తీసుకోవాలి.
స్టడీ షెడ్యూల్ : క్లిష్టత, సులభతరం ఆధారంగా ఏయే సబ్జెక్టుకు ఎంతెంత టైం కేటాయించాలో ఓ స్పష్టత ఉండాలి. వాస్తవికతో కూడిన స్టడీ షెడ్యూల్‌ను సగం విజయంగా చెబుతుంటారు. ఇది విద్యార్థి విద్యార్థికి మధ్య మారుతుంది.
సిలబస్, ఎగ్జామ్స్ విధానాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోవాలి. అన్ని సబ్జెక్టులపై సాధారణ అవగాహన కలిగి ఉండాలి. ప్రతి సబ్జెక్టుకు ఓ 'బ్లూ ప్రింట్' తయారుచేసుకోవాలి. వాటిలో ప్రాధాన్యాంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రధానాంశాలు అంటే ఏయే అంశాలపై ప్రశ్నలు పక్కాగా వస్తాయో వాటిని కొన్ని ప్రత్యేక చిట్కాలతో గుర్తు పెట్టుకోవాలి.
ఈ టైమ్ టేబుల్ ఫాలో అయ్యారంటే - జీవితంలో 'సెట్' అయినట్లే!
ఎగ్జామ్ టైమ్‌లో పుస్తకం తీయగానే నిద్ర వస్తుందా? - ఈ టిప్స్ వాడండి
కొత్త ఏడాది 2025కి పోటీ పరీక్షల ప్రణాళిక - జాబ్ క్యాలెండర్‌తో ప్రిపేర్ అవ్వండిలా !