Rakhi Celebrations at Shirdi Saibaba Temple: శిరిడీ సాయి ఆలయంలో రాఖీ వేడుకలు.. బాబాకు రాఖీ కట్టిన అర్చకులు - rakhi celebrations in shirdi saibaba temple

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 5:52 PM IST

Rakhi Celebrations at Shirdi Saibaba Temple Under Auspices of Sai Sansthan: అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల మధ్య బంధాన్ని బలపరిచేది రక్షాబంధన్. ఈ పండగను శిరిడీ సాయిబాబా ఆలయంలో సాయి సంస్థాన్​ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంత్రోచ్ఛారణల మధ్య సాగిన ఈ క్రతువును భక్తులు వీక్షించి పరవశించిపోయారు. మహిళ భక్తులు.. సాయిబాబాను పోషకుడిగా భావిస్తారు.  

ఈ రోజు శిరిడీలో నిర్వహించిన ర​క్షాబంధన్​ కార్యక్రమం మొదట కాకడ్​ హారతితో ప్రారంభమైంది. ఆ తర్వాత బాబాకు మంగళస్నానం చేయించారు. అనంతరం ప్రత్యేకంగా వెదురు, పాలరాతి ముత్యాలతో రూపొందించిన రాఖీని.. సాయి మందిరం అర్చకులు బాబా చేతికి కట్టారు. రాఖీ కట్టిన అనంతరం అర్చకులు సాయిబాబా విగ్రహనికి మధ్యాహ్న హారతి నిర్వహించారు. భక్తులు వహత్​ రహో అంటూ సాయిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. సాయి బాబా జీవించి ఉన్న కాలంలో రక్షా బంధన్ రోజున శిరిడీలో మహిళలు బాబాకు రాఖీ కట్టేవారని.. పురాణాలు వివరిస్తున్నాయని అర్చకులు వివరించారు. ఈ సంప్రదాయాన్ని నేటికి సాయి సంస్థాన్​తో పాటు భక్తులు కూడా కొనసాగిస్తున్నారు.​   

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.