Prathidwani : మద్యంతో ఆరోగ్యానికి చేటే.. ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా?
🎬 Watch Now: Feature Video
Prathidwani : మద్యపానం.. ఆరోగ్యానికి హానికరం. ఎన్నో ఏళ్లుగా వింటున్న మాటే ఇది. కానీ ఒంటబట్టించు కుంటున్నది ఎంతమంది? ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా 230 కోట్లమంది మందుబాబులు.. సరి కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఫలితంగానే ఏటికేటా లక్షల కోట్ల రూపాయల విలువైన పీపాల కొద్దీ మద్యం పరవళ్లు తొక్కుతోంది. ఏదో కాస్త తాగితే రిలాక్స్ ఉంటుంది అంటూ ఆటవిడుపుగా మొదలై జీవితాల్ని తలకిందులు చేస్తోందీ అలవాటు. ఇదే విషయంపై ఆక్స్‌ఫర్డ్ పాపులేషన్ హెల్త్, పెకింగ్ యూనివర్సిటీ ఇప్పుడొక సంచలన నివేదికను వెల్లడించింది. మరి ఆ నివేదికలో ఏం ఉంది.. సరదా మాటేమో గానీ.. మద్యం.. 61 విధాల చేటు అని ఎందుకు అనాల్సి వస్తోంది? బీపీ, కడుపులో అల్సర్లతో మొదలై ప్రాణాలు తీసే వరకు.. ఎన్నో రకాల అనారోగ్యాలను తీసుకొస్తున్న మద్యపానం.. రోగనిరోధకశక్తి తగ్గి ఉన్న ఆరోగ్య సమస్యల్లోనూ తీవ్రత.. మద్యం నుంచి దూరం జరిగితేనే రేపటితరానికి మేలు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.