పంచాంగంలో చెప్పిన గ్రహ ఫలితాలు మార్చుకోవడానికి అవకాశం ఉందా..? - ఉగాది పండుగ సమాచారం
🎬 Watch Now: Feature Video
Prathidwani: సకల శుభాలకు ఆరంభం.. ఉగాది పర్వదినం.. ఈ రోజు ప్రత్యేకం.. పంచాంగశ్రవణం.. ఏటా ఉగాది వస్తూనే ఉంటుంది. ఇలాంటి పంచాంగ శ్రవణాలు చూస్తునే ఉంటాం. కాకపోతే... అసలు ఏమిటీ ఈ పంచాంగం.. అది ఎందుకంత ప్రత్యేకం? అది ఎప్పుడైనా ఆలోచించారా? రోజూ ప్రతి చిన్న పనికి క్యాలెండర్, పంచాంగం ముందు పెట్టుకుని... వర్జ్యం, దుర్ముహూర్తం, రాహు కాలం, యమగండ కాలం, అమృత ఘడియలు ఇలా ఒకటికి రెండుసార్లు ముహూర్తాలు చూసుకుంటూ ఉంటారు. మరి వీటన్నింటికీ ఉన్న శాస్త్రప్రమాణం ఏమిటి? గురు, శుక్రులకు మాత్రమే మౌఢ్యం ఎందుకు వస్తుంది. ఆ సమయంలో చేయాల్సినవి.. చేయకూడనివి ఏమిటి? తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం చెప్పే సంగతులు ఏమిటి? చివరిగా... కాలాన్ని ఎవరూ శాసించలేరు. అదే సాధ్యమైతే ప్రతిఒక్కరు ఫలానా సమయానికి.. ఫలానా లగ్నంలోనే పుట్టాలని కోరుకుంటారు. అయితే పంచాంగంలో చెప్పిన గ్రహ ఫలితాలను మార్చుకోవడానికి అవకాశం ఉందా... ఈ కథ ఎప్పుడు, ఎలా మొదలైంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.