ETV Bharat / state

'హెచ్​ఎంపీవీ అంత ప్రమాదకరం కాదు - సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి' - INFECTION CONTROL ACADEMY OF INDIA

హెచ్ఎంపీవీ వైరస్ కేసులు ఇంతకు ముందు భారత్​లో ఉన్నాయన్న వైద్యులు - అనవసరంగా ఆందోళన చెందవద్దని సూచన - సోషల్ మీడియాలో కథనాలు అసంబద్ధమైనవని వ్యాఖ్య

DR BURRI RANGA REDDY
HUMAN METAPNEUMO VIRUS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 8:52 PM IST

DR Ranga Reddy Burri on HMPV Virus : కోవిడ్ తర్వాత వైరస్ పేరు చెబితే చాలు వణికిపోతున్న పరిస్థితి. ఎక్కడ ఇన్ఫెక్షన్ సోకుతుందో అని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న హెచ్ఎంపీవీ (హ్యుమన్ మెటా న్యూమో వైరస్) వైరస్ భారతీయులను ఆందోళనకు గురి చేస్తోంది. కర్ణాటకలో రెండు కేసులు వెలుగుచూసిన క్రమంలో మరింత భయం కలిగిస్తోంది.

అయితే వాస్తవానికి హెచ్ఎంపీవీ అంత ప్రమాదకరం కాదని గతంలోనూ భారత్​లో ఈ తరహా కేసులు నమోదవుతూనే ఉన్నాయంటున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో అసలు హెచ్ఎంపీవీ ప్రమాదకరమా? ఈ వైరస్ లక్షణాలు ఏమిటి? అనే అంశాలను ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ బుర్రి రంగారెడ్డి ఈటీవీ భారత్​కు వివరించారు.

హెచ్​ఎంపీవీ అంత ప్రమాదకరం కాదు: డాక్టర్ బుర్రి రంగారెడ్డి (ETV Bharat)

"హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్తది కాదు. ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఏవైతే కథనాలు వస్తున్నాయో అవన్నీ అసంబద్ధమైనవి. ఇది వరకే భారత్​లో ఈ కేసులు ఉన్నాయి. దీనిపై కేంద్రప్రభుత్వం స్టేట్​మెంట్ కూడా చూడవచ్చు. ఇది ఒక సీజనల్ ఎఫెక్ట్ మాత్రమే. దీంతో ఎలాంటి ప్రమాదం లేదు. దీనిని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. చైనాలో వచ్చిందనగానే అందరూ భయపడుతున్నారు అంతే. ఐదేళ్ల క్రితం వచ్చిన కొవిడ్ మళ్లీ రాబోతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అలాంటిది ఏమీ లేదు" -డాక్టర్ బుర్రి రంగారెడ్డి, ఐఎఫ్​సీఏఐ ప్రెసిడెంట్

కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స్పందన : హెచ్‌ఎంపీవీ వైరస్‌పై తాజాగా కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పందించారు. వైరస్‌ గురించి ఆందోళన చెందనక్కర్లేదని స్పష్టం చేశారు. హెచ్‌ఎంపీవీ వైరస్‌ విషయంలో అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. ఇది కొత్త వైరస్‌ కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. 2001లోనే హెచ్‌ఎంపీవీ వైరస్‌ను గుర్తించారని మరోమారు చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కొత్త వైరస్‌ అంశాన్ని డబ్ల్యూహెచ్‌వో కూడా పరిశీలిస్తోందని అన్నారు. హెచ్‌ఎంపీవీ కేసులపై ఐసీఎంఆర్‌ సమీక్షిస్తోందని, చైనా సహా పొరుగు దేశాల్లో పరిస్థితిని గమనిస్తున్నట్లు తెలిపారు.

భారత్​లో 'చైనా' వైరస్​ కలకలం- ముగ్గురు చిన్నారులకు HMPV నిర్ధరణ

ఆ జాగ్రత్తలు తీసుకోండి : 'చైనా కొత్త వైరస్'​ పట్ల వైద్యారోగ్య శాఖ సూచనలివే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.