Valentines Day Love Movies : ప్రేమికుల రోజు (వాలెంటైన్స్ డే) వచ్చేసింది. మరి ఈ రోజు మనసారా ప్రేమించిన వ్యక్తితో కలిసి గడిపితే ఆ సంతోషమే వేరు కదా. లవర్స్ డే రోజు మీకు ఇష్టమైనవారు, ప్రేయసితో కలిసి మంచి లవ్ స్టోరీ ఉన్న మూవీస్ చూడాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం ఈ 10 సినిమాలపై ఓ లుక్ వేసేయండి.
1. ప్రేమికుల రోజు
కునాల్, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'ప్రేమికుల రోజు'. సినిమా లవర్స్‌ను అప్పట్లో ఆకట్టుకుంటుంది. సెన్సేషన్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు యూత్‌ను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి.
2. చెలి
మాధవన్, రీమాసేన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'చెలి'. ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించారు. ఇందులో లవ్ సీన్స్ యువతను కట్టిపడేశాయి.
3. సఖి
దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన మూవీ 'సఖి'. ఈ ప్రేమ కావ్యంలో మాధవన్, శాలిని హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించారు. ఈ సినిమా పాటలు కూడా చాట్ బస్టర్ గా నిలిచిపోయాయి.
4. రోజా
మణిరత్నం తెరకెక్కించిన మరో లవ్ స్టోరీ 'రోజా'. అరవింద్ స్వామి, మధుబాల నటించిన ఈ మూవీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.
5. నువ్వు నేను ప్రేమ
సూర్య, జ్యోతిక, భూమిక కలిసి నటించిన సినిమా' నువ్వు నేను ప్రేమ'. ఈ సినిమా లవర్స్‌కు విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమాకు ఎన్ కృష్ణ తెరకెక్కించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
6. తొలి ప్రేమ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ 'తొలిప్రేమ'. ఈ సినిమా కూడా లవర్స్‌ను బాగా ఆకట్టుకుంది.
7. ప్రియురాలు పిలిచింది
అజిత్, మమ్ముట్టి, ఐశ్వర్యరాయ్, టబు నటించిన ఈ సినిమా కూడా లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అజిత్, టబు మధ్య లవ్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.
8. ఏ మాయ చేశావే
గౌతమ్ మీనన్ తెరకెక్కించిన అందమైన ప్రేమ కథా చిత్రాల్లో 'ఏ మాయ చేశావే' ఒకటి. నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం లవర్స్ కు విపరీతంగా ఆకట్టుకుంది.
9. ఎటో వెళ్లిపోయింది మనసు
నాని సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సినిమాను గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. ఈ చిత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంది.
10. సీతారామం
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన లవ్ బ్యాక్ డ్రాప్ మూవీ 'సీతారామం'. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
వాలెంటైన్ డే స్పెషల్ సాంగ్స్- మీ పార్ట్‌నర్‌కి ఓ పాట డెడికేట్ చేసేయండి!
వాలంటైన్స్ డే : అనుపమ టు మృణాల్ ఠాకూర్ - ఈ ముద్దుగుమ్మల ప్రేమ కథలు తెలుసా?